Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రాష్ట్రంలో మరో 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, ఇకపై మనం వేసే ప్రతి అడుగూ ఎన్నికలదిశగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్దంకి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమవుతోన్న జగన్ నేడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన జగన్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో సహా వివరించారు. పార్టీ బలోపెతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

 • పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది
 • నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుంది
 •  డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం, ఈ నియోజక వర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చాం, 93,124కుటుంబాలకు మేలు చేశాం.
 • 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 47,123 మందికి బియ్యంకార్డులు మంజూరుచేశాం
 • ఈ స్థాయిలో ఇంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా చేశాం
 • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ, ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా ఆయా కుటుంబాలకు మంచిచేశాం, బటన్‌ (డీబీటీ) నొక్కి  వారి ఖాతాల్లోకి జమచేశాం
 • చేసిన మంచిని ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ వివరిస్తూ, వారికి లేఖలు ఇస్తూ గడపగడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
 • మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నారు
 • ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండికూడా రాని పరిస్థితి ఉంటే అటువంటి వాళ్లకీ మళ్లీ మంచిచేయాలన్నదే ఈ గడపగడపకూ కార్యక్రమం ఉద్దేశం
 • అందరికీ మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం
 • ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షలు ఇచ్చాం
 • ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తాం
 • ప్రతి సచివాలయంలో కనీసం రెండురోజులు గడపగడపకూ కార్యక్రమం  చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటలపాటు ఆ సచివాలయంలో తిరగాలని చెప్పాం
 • దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతాం
 • అన్నిరకాలుగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే, ఎన్నికలకు దాదాపుగా రెండేళ్లకు ముందే నాయకులను ఈవిధంగా తిప్పిన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదు
 • దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు ఎలాంటి సాధకబాధకాలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి
 • ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తాం
 • ముఖ్యమంత్రిగా నేను డీబీటీ ఇవ్వడం అయితేనేం, స్కూళ్లు బాగుచేయడం, ఆస్పత్రులు బాగుచేయడం అయితేనేం, వ్యవసాయం బాగుండేలా చూడ్డం అయితేనేం.. ఇలా నేను చేయాల్సింది నేను చేయాలి
 • అదే సమయంలో మీరు చేయాల్సింది మీరు చేయాలి
 • నేను, మీరు ఇద్దరం కలిస్తేనే.. 175కి 175 సీట్లు సాధించగలుగుతాం, ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానే కాదు
 • గ్రామంలో వచ్చినప్పుడు నియోజకవర్గంలో మెజార్టీ ఎందుకు రాదు? నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు 175కి 175 ఎందుకు రావు
 • అద్దంకిలో కూడా మొత్తం 5కి 5 జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఐదింటికి ఐదు, అద్దంకి మున్సిపాల్టీ, 103 గ్రామ పంచాయతీల్లో 87 సర్పంచి స్థానాలు గెలిచాం
 • చరిత్రలో నిలబడిపోయే విధంగా దేవుడి దయతో గొప్ప పాలన ఇవ్వగలుగుతున్నాం
 • గతంలో 151 సీట్లు గతంలో వస్తే.. ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు, ఇప్పుడు 175కి 175 సీట్ల టార్గెట్‌ సాధించగలుగుతాం :
 • ఏమైనా సమస్యలు ఉంటే.. కుటుంబంగా వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు నడవాలి, అందరం ఒక్కటై కష్టపడదాం, 175కి 175 సీట్లు సాధిద్దాం
 • అద్దంకిలో మునుపెన్నడూలేని విజయాన్ని నమోదు చేద్దాం…

అంటూ పార్టీ కార్యకర్తలు హితబోధ చేశారు.

ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com