The Secret is: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ… నేను చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర పని చేశాను. ఆ సమయంలో ఓ పాయింట్ అనుకుని స్టోరి డెవలప్ చేయడం ప్రారంభించాం కానీ.. ఎందుకనో దాని ఫైనల్ ఔట్ పుట్ బాగా వచ్చినట్లు అనిపించలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టేశాం. జిల్ సినిమా చేసిన తర్వాత ప్రభాస్ గారితో సినిమా అనుకోగానే ఆయన కోసం ఈ కథపై వర్కవుట్ చేశాను. ఆ సమయంలో చంద్రశేఖర్ ఏలేటి గారు కూడా ఇది కన్‌క్లూజన్ సరిగ్గా రాలేదు కదా అన్నారు కానీ.. ఆయనకు చెప్పి మరో ఆరు నెలలు ఈ కథ పై వర్క్ చేశాశాను. కన్‌క్లూజన్ బాగా వచ్చింది. అప్పుడు ఆ కథను ప్రభాస్ గారికి, యువీ క్రియేషన్స్‌కి చెప్పగానే వాళ్లకి బాగా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లింది.
రాధే శ్యామ్ కథను ప్రభాస్ గారు బాహుబలి సినిమా రిలీజ్ కాక ముందే ఒప్పుకున్నారు. మాకు అప్పుడే బాహుబలి పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో సినిమాను భారీగానే ప్లాన్ చేసుకున్నాం. అంతే కానీ, బాహుబలి తర్వాత ఈ సినిమా కథలో మార్పులు చేయలేదు. ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ గారు హస్త సాముద్రికా నిపుణుడిగా కనిపిస్తారు. ఆయన పాత్రను అలా డిజైన్ చేయడానికి ఇన్‌స్పిరేషన్.. ఐరిష్ జ్యోతిష్యుడైన విలియం జాన్ వార్నర్. ఆయన్ని అందరూ కీరో అని పిలిచేవారు. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో పాటు రెండు మూడు రియల్ ఇన్‌సిడెంట్స్‌ను బేస్ చేసుకుని ప్రభాస్ గారి రోల్ డిజైన్ చేశాం అన్నారు.