సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’ నేడు (సెప్టెంబర్ 17) విడుదలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, నిర్మాత, విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ, దర్శకుడు వి.వి. వినాయక తదితరులు కూడా పాల్గొన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ.. “నేను పస్ట్ టైమ్ విష్ణుతో ఢీ, రామ్‌తో రెఢీ, మహేశ్‌తో దూకుడు, ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్‌బస్టర్ చిత్రాలే. అలాగే ఫస్ట్ టైమ్ సందీప్‌తో చేసిన గల్లీరౌడీ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాను. చిరంజీవిగారు అంత టైమ్ తీసుకుని మా ట్రైలర్‌ను విడుదల చేసి మా టీమ్‌ను ఎంకరేజ్ చేసిందనుకు ఆయనకు పాదాభివందనాలు’’ అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ…‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఎక్కువ ఆలోచించకుండా సరదాగా నవ్వుకునే ఓ సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ‘వివాహ భోజనంబు’ సినిమాను రూపొందించిన భాను, సాయి.. ‘గల్లీ రౌడీ’ కథతో వచ్చారు. వాళ్లు మరో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ కథను నాగేశ్వర్ రెడ్డి గారి దగ్గరకు పంపాను. ఆయనకు నచ్చింది. సినిమా చేద్దామని అన్నారు. అక్కడ నుంచి కోన గారి దగ్గరకు కథ వెళ్లింది. కోన వెంకట్ గారు, ఎం.వి. సత్యనారాయణ గారితో మా ప్రయాణం ప్రారంభమైంది. జీవీ గారు నిర్మాతగా ముందుండి మమ్మల్ని నడిపించారు. నిజాయతీగా అందర్నీ నవ్వించడానికి చేసిన ప్రయత్నమే గల్లీరౌడీ. ట్రైలర్ చూసిన చిరంజీవి గారు.. సందీప్ నీకు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా బావుంటాయి. ఇలాంటి పాత్రలు బాగా నప్పుతాయని అన్నారు. అది ఆయన గొప్పతనం. దేశంలో మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అది ఒకరికొకరు ఇచ్చే సాయం. మీరందరూ మాకు ఇచ్చే నమ్మకం. థియేటర్లలో సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.