Sunday, January 19, 2025
HomeTrending News3 Capitals: సుప్రీం స్టే మొట్టికాయ లాంటిది: సజ్జల

3 Capitals: సుప్రీం స్టే మొట్టికాయ లాంటిది: సజ్జల

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో సభ నిర్వహించే సమయంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో  న్యాయరాజధాని ఏర్పాటుకు ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధి విధానాలపై ప్రజాకోర్టులో ప్రజల తీర్పు ఉంటుందని, జగన్ మూడు రాజధానులు చట్టం చేసిన తరువాత అన్ని ఎన్నికల్లో జనం మద్దతు తెలిపారని సజ్జల గుర్తు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై స్పందించారు.

మూడు రాజధానులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష  మేరకు ఉందని,  కానీ గతంలో  హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయని అభిప్రాయపడ్డారు.  ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి .. హైకోర్టు తీర్పు దానికి భిన్నంగా ఉందని భావించి సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.

ప్రభుత్వ విధానంలో తప్పొప్పులను నిర్ణయంచాల్సింది ప్రజలేనని, ప్రజా కోర్టులోనేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  ప్రభుత్వ నిర్ణయాలు ఏవి చేసినా … సహజ న్యాయానికి, సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలని, అలా ఉన్నప్పుడు  మిగిలిన వ్యవస్థలు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు.

ఒకే రాజధాని ఉండాలి, అక్కడే అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకొని ఉంటే  గత ఎన్నికల్లో  ప్రజలు ఆ మేరకు తీర్పు చెప్పేవారని, కానీ  అమరావతి లోనే దీనికి మద్దతు లభించలేదని, జనం తిరస్కరించారని అన్నారు.  గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెట్టలేమని తేలిపోయిందని,  వికేంద్రీకరణ కు అనుకూలంగా ఉన్నందుకు  అమరావతిలోనే టీడీపీ ని ఓడించారని ఆయన పేర్కొన్నారు.  సాంకేతికంగానో, వ్యవస్థలో చొరబడి మూడు రాజధానులను అడ్డుకోవాలనుకోవడం,  కుట్రలు చేయడం లాంటి అంశాలను తమ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందుంచిందని, అందుకే  నేటి స్టే ఓ మొట్టికాయ లాంటిదని సజ్జల అభివర్ణించారు. రాజ్యాంగానికి వ్యతికేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు చేసినప్పుడు చెక్ చేయడానికి న్యాయవ్యస్థ ఉందని, కానీ ప్రభుత్వ నిర్ణయం నచ్చకుంటే ప్రజలే  ఎన్నికల్లో తీర్పు ఇస్తారని అన్నారు.

చంద్రబాబును అర్జంటుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నదే  పవన్ కళ్యాణ్ కోరిక అని కానీ ప్రజలు దీన్ని అంగీకరించడం లేదన్నారు సజ్జల.

Also Read : Supreme Court: అమరావతి రాజధానిపై సుప్రీం పాక్షిక స్టే 

RELATED ARTICLES

Most Popular

న్యూస్