Sunday, September 29, 2024
HomeTrending Newsవడ్ల కొనుగోలుకు కేంద్రాన్ని వెంటాడుతాం

వడ్ల కొనుగోలుకు కేంద్రాన్ని వెంటాడుతాం

We Will Chase The Central Government To Buy Paddy Grain :

వడ్లు కొనుగోలు, పెట్రోల్ మీద సెస్సు తగ్గింపు మీద కేంద్రం తీరును కెసిఆర్ ఎండగట్టారు. బిజెపి నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సిఎం కెసిఆర్ ఈ రోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశంలో మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి,  తెరాస నేతలు గండ్ర వెంకట్ రమణ రెడ్డి, బసవరాజు సారయ్య, జీవన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిజెపి కేంద్రంలో, రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలపై కెసిఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

పార్లమెంట్ లో వివిధ బిల్లుల విషయంలో బిజెపికి మద్దతు ఇస్తే అప్పుడు తెరాస దేశ ద్రోహి కాదు, బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశాద్రోహులా, బిజెపి దేశ ద్రోహుల ఫ్యాక్టరీ నా ? ఏవరైనా తప్పులు ఎత్తి చూపితే దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తారా? రైతు చట్టాలపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రం విధానాల్ని తప్పు పట్టారు, బిజెపి ఎంపి వరుణ్ గాంధీ మద్దతు ఇచ్చారు వాళ్ళు దేశ ద్రోహులా ? చైనాలో డబ్బులు పెట్టానా బిజెపి నేతలు తల తోక లేని వ్యాఖ్యలు చేస్తున్నారు.

తెలంగాణలో వడ్లు కొంటారా లేదా? పంజాబ్ లో పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. తెలంగాణ వరి ధాన్యం కొంటారా కొనరా జవాబు ఇవ్వండి. ప్రజల కోసం పోరాడిన వారిగా దేశంలో ఏ ప్రాంతం వారైన బాగుండాలని కోరుకుంటాం. రాయలసీమ బాగుండాలని చెప్పాను. కరువు సీమ బాగుపడాలని చెప్పాం. అక్కడికి వెళ్లి చేపల కూర తిన్నావ్ అవును తింటే తప్పు ఏందీ? అది నిజం బెజాప్త కాదు బాజాప్త చెపుతున్నాను. ఈ విషయం సిఎం జగన్ తో కూడా చెప్పాను. కృష్ణ నది లో నీళ్ళు లేవు గోదావరి నుంచి తీసుకువస్తున్నాం అన్నాను.

కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలకు అలవాటు అయింది. కర్నాటక, తమిళనాడు లో ఎన్నికలు ఉంటె కృష్ణ నీళ్ళు, కావేరి నీళ్ళు అంటారు. కొందరు నేతలకు వ్యక్తిగత దూషణలు చేయటం అలవాటుగా మారింది. విషయ పరిజ్ఞానంలేని వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం ఎంత వరి సాగు అయిందో చూసేందుకు ఆరు హెలికాప్టర్ లు పెడతాను కేంద్రమంత్రిని తీసుకుని రండి. ఎంత పండితే అంత కొంటామని ఎందుకు చెప్పటం లేదు. వడ్లు తప్పా అన్ని మాట్లాడు అని కేంద్రం నుంచి ఆదేశాలు రాగానే దేశద్రోహి మాట్లాడుతున్నాడు.

తెలంగాణ ఉద్యమంలో నువ్వు(బండి సంజయ్)ఎక్కడ ఉన్నావ్. ప్రతి రోజు నేనే మాట్లాడుతాను వదిలి పెట్టేది లేదు రోజు నేనే మాట్లాడుతా బిజెపి నేతల తప్పుడు ఆరోపణలని ఇక నేనే ఎండగడతాను. తెలంగాణకు ఎం చేసినావు అని అడుగుతారు? తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఉరు లేదు తెరాస సంక్షేమ పథకం అందని కుటుంబం లేదు. గొర్ల పథకంలో కేంద్రం వాటా అస్సలు లేదు కేంద్ర సహకార బ్యాంకు నుంచి లోను తీసుకొని వడ్డీ కడుతున్నాం. మీకు అన్ని తెలిసి ఉంటె బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెరాసకు మించిన పథకాలు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు. పెట్రో ధరలు పెరిగాయంటే పాకిస్తాన్ వెళ్ళండి అంటారు. పొంతన లేను మాటలు మాట్లాడుతారు.

మేము రెండుసార్లు ప్రజలు ఎన్నుకుంటే పాలనాలో ఉన్నాము. మీలాగ దొంగ లెక్కలు చేయలేదు. మీ మాదిరిగా దొడ్డి దారిన కర్నాటక, మధ్యప్రదేశ్ లలో అధికారంలోకి వచ్చారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలు ఏర్పరిచారు, వీటి మీద మాట్లాడితే తప్పా? ఈ రాష్ట్రంలో 107 స్థానాల్లో బిజెపి డిపాజిట్ పోయింది. మీకు లొంగి ఉండి మీకు ఇబ్బంది కలిగించక పోతే మంచివాళ్ళు, మిమ్మల్ని విమర్శిస్తే దేశద్రోహులు, ఇంకా ఏమన్నా అంటే ఆదాయ పన్ను శాఖతో సోదాలు చేయించటం ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వారు లేరు. వడ్లు కొనుగోలులో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఫాం హౌస్ లో పన్నావ్ అంటారు. అది నా నియోజకవర్గం, నా వ్యవసాయ క్షేత్రం అక్కడ నేను ఉంటాను అందులో తప్పు ఏంటి?

దళిత సిఎంను పెట్టలేదు దానికి కారణాలు ఉన్నాయి. దళిత సిఎం లేకుండా అడ్డుకున్నామని ఆ విషయం షబ్బీర్ అలీ కూడా చెప్పాడు. మీ లాగ గాలి మాటలు మాట్లాడటం లేదు. అబద్దాలు చెపుతున్నది మీరు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి జి.హెచ్.ఎం.సి లో బిజెపి గెలిచింది. అయినా మా కన్నా ఎక్కువ గెలిచారా తెలంగాణాలో నువ్వు ఎక్కడ ఉన్నావ్

నేను సిద్ధిపేట నుంచి మొదలుపెడితే కరీంనగర్, మహబూబ్ నగర్, గజ్వేల్  వరకు అంతటా గెలిచాను. ఈ దేశంలో ఏ వర్గం ప్రజలకు బిజెపి మేలు చేసింది. మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు దాని కోసం జోనల్ చట్టం తెచ్చాం దాన్ని ఆమోదించేందుకు మీరు(కేంద్ర ప్రభుత్వం) ఇబ్బంది పెట్టారు. ఉద్యోగులు అందరిని సర్దుబాటు చేసి అప్పుడు  నోటిఫికేషన్ ఇస్తాం. లేకపోతే భూపాలపల్లి జిల్లా వాళ్ళు వరంగల్ వారితో పోటీ పడలేరు. నిరుద్యోగ రేటు దేశంలో ఎంత ఉంది. తెలంగాణాలో ఎంత ఉంది. ఒకసారి తెలుసుకో బండి సంజయ్?

హద్దులు మీరి మాట్లాడుతున్నది మీరు నేను కాదు గజేంద్ర షెకావత్ పార్లమెంటు సాక్షి చెప్పారు. మిషన్ భగీరథ ఏ విధంగా అమలు అవుతుందో వివరించారు.

సంక్షేమ పాలనలో తెలంగాణకు పోటీ ఎవరు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినట్టు చెప్పి వెనుకకు పోతే తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అప్పుడు నిజామాబాదు ఎమ్మెల్యే ఎండల లక్ష్మి నారాయణ రాజీనామా చేస్తే, మరో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు. నిజామాబాదు కు నేను ప్రచారానికి వెళితే దద్దమ్మ నీ పక్కకు ఉన్నాడు అని కిషన్ రెడ్డిని ప్రజలు ఎద్దేవా చేశారు.

పెట్రో మీద సెస్సు ఉపసంహరిస్తే మునుపటి లాగ 73 రూపాలకు దొరుకుద్ది. మేము పరిపాలన సర్దుబాటు చేస్తే దాని గురించి ఎం మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో ఏ రాష్ట్రాన్ని ఆడుకున్నారు. ఒక్క మెడికల్ కాలేజి తేలేదు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు. కొత్త జిల్లాల్లో నవోదయ స్కూల్స్ కోరితే ఇవ్వలేదు. ఈ దేశ ఖజానాలో తెలంగాణా సొత్తు ఉంది మేము ఈ దేశ ప్రజలం కాదు. మొండి వాదనలు, తలతోక లేని ఆరోపణలు ఈడి తో దాడులు, ఆదాయపు పన్ను శాఖతో దాడులు చేయిస్తే భయపడే వారు తెలంగాణ లేరు.

ఏమన్నా అంటే ఫాంహౌస్ లో దున్నుతా అంటడు అంటే నువ్వు(బండి సంజయ్ ) ట్రాక్టర్ లేబర్ వా అను అడుగుతున్నాను. మేము ఎవరికీ భయపడం.

నేను పోయి సుటుకేసు ఇచ్చానా మీరు ఆ పనులు చేసేది. ఇతర రాష్ట్రాల్లో ఎం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనే వరకు వెంటాడుతాం. రైతుల తరపున వేటాడుతాం అందులో ఎలాంటి అనుమానం లేదు.

నీ ముక్కు మంచిగా లేదు, మందు తాగుతావ్ అంటావ్ నాకు ఎప్పుడైనా మందు కలిపినవా? నా వ్యవసాయ క్షేత్రాన్ని నా భూమి దున్నుత అంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆరు ముక్కలు అయితావ్ అని అందుకే అంటున్నా. మళ్ళీ చెపుతున్నాను మాకు బాస్ ప్రజలు మాత్రమె ఇక ఎవరికీ భయపడం.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. గెలుపు ఓటములు సాధారణం ఎన్నో ఉప ఎన్నికల్లో గెలిచాం అంత మాత్రాన మేము ఆహంకారానికి  పోలేదు. వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజక వర్గాల్లో ధర్నాలు చేస్తాం. కలిసి వచ్చే అన్ని పార్టీలను, రైతులను కలుపుకొని ధర్నా చేస్తాం. ధాన్యం కొంటారో కొనరో తేలాలి.

మన భూభాగం కాపాడండి అని అడిగితే దేశ ద్రోహా? చైనా నుంచి మన భూభాగం కాపాడమంటే దేశాద్రోహా? ఈ దేశంలో ఎవరు ఉహించని పథకాలు మేము ప్రవేశ పెట్టాం. ఒక పార్టీ, ఒక రాష్ట్రాన్ని సృష్టించిన నేతను నేను.

రాష్ట్ర బిజెపి నాయకులకు సిగ్గు ఎగ్గు లేదు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు తీసుకున్న రోజు బిజెపి నేతలు ఎక్కడ అన్నారు. మాతో చెప్పకుండా చేసినందుకు ప్రధాని ఫాసిస్టు అన్నాను నన్ను ప్రధాని అడిగితే అవును అన్నాను స్పష్టం చేశాను.

కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్రం కదా అని కేంద్ర ప్రభుత్వంతో సర్దుబాటు దోరణిలో వెళుతున్నాం. ఇక వదిలి పెట్టేది లేదు. ఫెడరల్ ఫ్రంట్ అని నేను ఇంట్లో పడుకున్నానా? ఇప్పుడు అర్జెంట్ గా ఫెడరల్ ఫ్రంట్ నీకు కావాలా?వడ్లు కొంటారా కొనరా అనే విషయంలో బండి సంజయ్ కి మెడ మీద తలకాయ లేనోడు అని తెలిసిపోయింది. బిజెపి నేతలను నమ్మితే మనం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అని రైతులను కోరుతున్నాను.

ఇన్ని రోజులు క్షమించం ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయని ఊకున్నాం. అదే రీతిగా మాట్లాడితే వదిలిపెట్టేది లేదు. డీజిల్, పెట్రోల్ మీద సెస్సు రద్దు చేయాలి దీనిపై వెంటపడతాం. దేశవ్యాప్తంగా కట్టిన ప్రాజెక్టులు కట్టింది కమీషన్ల కోసమా? పంజాబ్ లో మాదిరిగా ధాన్యం కొంటారా కొనరా వెల్లడించాలి.

తెలంగాణలో ప్రపంచంలోనే ఎక్కువ సీడ్ కంపనీలకు అమ్ముకుంటారు. సీడ్ కంపనీలతో ఒప్పందాలు ఉంటె మీరు సాగు చేసుకోవచ్చు. మిల్లర్లతో అవగాహన ఉన్న వారు వరి పండించ వచ్చు. మాకు ఎంత ధర వచ్చినా పర్వాలేదు అనుకునే వారు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మనం నమ్మలేము. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఆవాలు, మినుములు వేస్తె ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

పంటల మార్పిడిపై ఖచ్చితంగా రైతులకు సలహా ఇస్తాం. ఎవరివి నక్క జిత్తుల మాటలో తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రైతుల ముందు బిజెపి పంచనామా చేసి తీరుతాం. మీ(బిజెపి)మెడలు వంచి తీరుతాం.

ASLO Read :సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్