Saturday, November 23, 2024
HomeTrending NewsSajjala: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం

Sajjala: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం

ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.  సాంకేతిక విషయాలు పక్కన పెడితే అమరావతిలో రెండు వర్గాల మధ్య, రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతుందని, జగన్‌ పేదల పక్షాన..చంద్రబాబు, టీడీపీ పెత్తందార్లవైపు నిలబడ్డారని వ్యాఖ్యానించారు.  తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం కోర్టుకు వెళ్లక తప్పదు..పేదలకు ఉపయోగపడేది అంశం..ప్రభుత్వానికి హక్కున్న అంశం కాబట్టి తప్పనిసరిగా వెళ్తాం’ అని సజ్జల స్పష్టం చేశారు.

సజ్జల ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలు…

  • అమరావతి అనేది 30వేల మంది ఇచ్చిన భూములు..దానిలో చాలా వరకూ చేతులు మారాక వాళ్ల ఇష్టాల ప్రకారం నడవడానికి ఇదేమన్నా రియల్‌ ఎస్టేట్‌ వెంచరా..?
  • ఇక్కడ మౌలిక వసతుల కల్పన, సిటీ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏదన్నా చేస్తే ప్రశ్నించవచ్చు.
  • మేం భోపాల్‌ గ్యాస్‌ లాంటి కెమికల్‌ ఫ్యాక్టరీలు ఏదీ తీసుకొచ్చి పెట్టలేదు కదా
  • ఇక్కడ బయట వారిని తీసుకొచ్చి ఎలా పెడతారు అని వారు ప్రశ్నిస్తున్నారు.
  • నువ్వు ల్యాండ్‌ ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు..?
  • అందులోనే నివాసానికి మాత్రమే ప్లాట్లు ఇచ్చాం
  • అమరావతిలో పలు ఇనిస్టిట్యూషన్స్‌ ఉన్నాయి..వాటిలో రైతులుంటారా..?
  • కాలేజీలు వచ్చాయి..స్టూడెంట్స్‌..ఇతర బయట వారే కదా ఉండేది.
  • నీ ఆస్థి నువ్వు వాలంటరీగా ఇచ్చావు..దానికి బదులుగా నీకు ప్లాట్లు వచ్చాయి.
  • సిటీ అభివృద్ధి గతంలో కంటే బెటర్‌గా చేస్తున్నాం.
  • గతంలో కరకట్టకు సరిగ్గా రోడ్డే లేదు. దాన్ని కూడా మేం వేస్తున్నాం.
  • ఖాజా వరకూ కృష్ణా నది గుండా బైపాస్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో పూర్తి కానున్నాయి.
  • అమరావతి ప్రాంత అభివృద్ధికి అత్యవసర లింకేజీ…కనెక్టివిటీ రోడ్లను ఇస్తున్నది జగన్‌ గారు.
  • ఇక్కడ పట్టాలు ఇచ్చిన వారిలో చాలా మంది అమరావతి ప్రాంతం వారే ఉన్నారు. విజయవాడ వారికి కొండపల్లి వద్ద ఇచ్చారు.
  • సాంకేతికంగా చూసినా అమరావతిలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు చట్టంలో అవకాశం ఉంది.
  • మాది పంతం కాదు..కక్ష తీర్చుకోవడం అంతకన్నా కాదు:
  • మేం పంతానికి చేయలేదు. వాళ్లనుకుంటున్నట్లు కక్ష తీర్చుకోడానికి చేయలేదు.
  • ఏదైతే రంగుల కలను చూపించి అభివృద్ధి మోడల్‌ ఇలా ఉండాలని చంద్రబాబు అనుకున్నాడో అది కాదు అభివృద్ధి అని చెప్తున్నాం.
  • సింగపూర్‌ కంపెనీకి అప్పనంగా 3వేల ఎకరాలు అప్పజెప్పి, వారికి అన్నీ నేనే ఇస్తాను ముప్పై ఏళ్లవరకూ ఏమైనా చేసుకోవచ్చని చెప్పాడు.
  • నిజమైన రైతుల భూములకు రేట్లు పలకకుండా చేసిన పరిస్థితికి భిన్నంగా జగన్‌ గారు సజీవమైన నగరం అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
  • రోడ్‌ కనెక్టివిటీ, కొత్తగా 50 వేల కుటుంబాలు వస్తున్నాయి.
  • ఇచ్చింది ఎవరికీ దోచిపెట్టలేదు. పేదలు లేనిది సమాజమే లేదు. ఇచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.
  • అసలు వీళ్లని కాదనుకుని ఒక రాజకీయ పార్టీ మనగలుగుతుందా..?
  • చంద్రబాబు, ఆయన పార్టీ వారికి దూరంగా వెళ్లిపోయారా అనేది అర్ధం కావడం లేదు.
  • వారికి అవసరమైన ఏర్పాటును జరగకూడదని ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నారు.
  • ఆనాడు జగన్‌ గారు క్లారిటీతోనే మొదలుపెట్టారు..పంతం కోసం కాదు.
  • 30 వేల ఎకరాలు ఏం చేసుకుంటారు..? పేదలకు పనికి రాదా..?:
    అక్కడి అభివృద్ధిలో ఉన్న వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నారు.
  • అంత ల్యాండ్‌ ఏం చేసుకుంటాడు 30వేల ఎకరాలు..? రాత్రికి రాత్రి ఏం వస్తాయి..? పేదలకు ఇళ్లు ఇవ్వడానికి పనికి రాదా..?
  • అడ్డం కొట్టాలనే శక్తులు ప్రయత్నం చేస్తున్నారు.
  • దీనికి రొమ్ము విరుచుకుని మా సక్సెస్‌ అనుకుంటే అంతకంటే ఫూలిష్‌నెస్‌ ఉండదు.
  • కనీసం ప్రజలకు ఎవరు ఏ పక్షాన ఉన్నారో తెలుస్తుంది. ఇప్పుడు అది తెలియడానికి ఈ కేసు ఉపయోగపడుతుంది.
  • నడిపేదంతా వాళ్లే…సొసైటీ అని పేరు చెప్పి దమ్మాలపాటి శ్రీథర్‌ లాంటి లాయర్లతో నడుపుతున్నారు.
  • ఆ లాయర్లనంతా ఎంగేజ్‌ చేసేది చంద్రబాబు నాయుడు.వాళ్ల వాదనలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
  • ల్యాండ్‌ అంతా తీసుకుని రూ.340 కోట్లు ఇవ్వాలి..దానిలో 50 శాతం కూడా ఇవ్వలేదంటారు.
  • అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. దానికి సంబంధించి మీరు ప్రశ్నించడానికి స్థానిక అర్హత ఏంటి..? చంద్రబాబు ఊరకనే తీసుకున్నాడా..?
  • చంద్రబాబు తాను అమరావతి కడతాను అన్నాడని తర్వాత వచ్చే గవర్నమెంట్‌ కూడా ఆయన ఏది చెబితే అదే చేయాలా..?
  • ఇది నిలబడదు…ఖచ్చితంగా ప్రభుత్వం విజయం సాధిస్తుంది.
  • ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు న్యాయ వ్యవస్థకు కూడా తెలుసు.
  • అందులోనే ఎక్కడా పక్కదారి పట్టలేదు. ప్రభుత్వానికి చేయాల్సిన బాధ్యత చేస్తోంది.
  • ఆ 30వేల మంది రైతుల్లో చాలా మంది వెళ్లిపోయారు. ఇప్పుడున్న 500 మంది రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు సంఘంగా ఏర్పడ్డ వారు ప్రభుత్వం ఎలా ఉండాలో వారు డిసైడ్‌ చేస్తారా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్