Tuesday, September 17, 2024
HomeTrending Newsరైతులను ఆదుకుంటాం: శివరాజ్ సింగ్

రైతులను ఆదుకుంటాం: శివరాజ్ సింగ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు రెండోరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో పంటనష్టం పరిశీలించిన అనంతరం రైతులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను, ఆవేదనను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి హిందీలో  తర్జుమా చేసి మంత్రికి  వివరించారు. రైతులను ఓదార్చిన కేంద్రమంత్రి రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని హితవు పలికారు. రైతు సమస్యలపై  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సున్నితంగా స్పందిస్తారని అన్నారు.

గత తొమ్మిది రోజులుగా రైతు పోలాలు నీటి మునిగాయని, తాను స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి తెలుసుకున్నాని, రైతులు, కౌలు రైతులను కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని, మీ సమస్య లు అర్థం చేసుకున్నానని వారితో అన్నారు.  ఫసల్ బీమా యోజన కు గత ప్రభుత్వం భీమా చెల్లించ లేదన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంటనష్టం ఎగ్జిబిషన్ సందర్శించిన శివరాజ్ సింగ్ ఒక మొక్కను నాటారు. ఈ పర్యటనలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు  రవీంద్ర, బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్