Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌ మూవీతో రాజమౌళి రికార్డుల దగ్గరకు వెళతారా..?

మహేష్‌ మూవీతో రాజమౌళి రికార్డుల దగ్గరకు వెళతారా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇందులో మహేష్‌ బాబుకు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఇదే సంస్థ ధనుష్ తో సార్ అనే సినిమాను నిర్మించింది. తెలుగు, తమిళ్ లో రూపొందిన మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడారు.

అయితే.. నిర్మాత నాగవంశీ ‘సార్’ మూవీ గురించే కాకుండా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా గురించి కూడా స్పందించారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. మహేష్ బాబు సినిమాతో రాజమౌళి రికార్డ్స్ కు దగ్గరగా వెళతామన్నారు. అంతే కాకుండా మహేష్ మూవీతో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులకు దగ్గరగా వెళతామని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో ఇంచు మించు ఆ రేంజ్ కి వెళ్లామన్నారు.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్ లని చూశానని.. ఈ సినిమా అద్భుతాలు చేస్తుందనే నమ్మకం వుందని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ‘#SSMB28’ ఎస్. రాధాకృష్ణ బాబాయ్ అవుతారు. ఆ కారణంగానే నిత్యం ఆయన నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ని సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేస్తూ అభిమానులతో టచ్ లో వుంటుంటారు. అయితే.. నాగవంశీ ఇలా చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్ అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. మరి.. నాగవంశీ చెప్పింది కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తెలియాలంటే మహేష్‌ మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Also Read:మహేష్‌ కోసం జగ్గుభాయ్ నిజమేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్