Wednesday, October 4, 2023
HomeTrending Newsమళ్ళీ విజయం మాదే: రోజా ధీమా

మళ్ళీ విజయం మాదే: రోజా ధీమా

జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వ్యతిరేకించిన వారు… ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని హామీ ఇస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థను కించపరిచిన తెలుగుదేశం ఆ వ్యవస్థను రద్దు చేయబోమని, కొనసాగిస్తామని చెబుతున్నారని విమర్శించారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో నేడు రెండోరోజు టిటిడి చైర్మన్ & ఉమ్మడి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి , రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, వాణిజ్య శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ లతో కలిసి  రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

త్వరలోనే విశాఖనుంచి పాలన ప్రారంభమవుతుందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెడతామని  రోజా వెల్లడించారు. విశాఖ గర్జన సమయంలో కావాలనే పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం పెట్టుకున్నారని, ఆ తర్వాత ఇప్పటి వరకూ విశాఖలో జనవాణి ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లోనూ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని  ధీమా వ్యక్తం చేశారు.

Also Read : యుద్ధానికి మేం భయపడం: రోజా 

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న