Monday, September 23, 2024
HomeTrending NewsYuva Galam: ఆస్తి పన్ను ఇంకా పెంచుతారు: లోకేష్

Yuva Galam: ఆస్తి పన్ను ఇంకా పెంచుతారు: లోకేష్

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సిఎం జగన్ నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏపీలో మూడు వేల రూపాయలు ఉన్న విద్యుత్ మీటర్ ను పక్క రాష్ట్రాల్లో వెయ్యి రూపాలకే అమ్ముతున్నారని, ఈ భారాన్ని ప్రజలపైనే మోపుతున్నారని విమర్శించారు. జగన్  విద్యుత్ రంగాన్ని ఏ స్థాయిలో, ఎంత నాశనం చేశారో అర్ధం కావడం లేదని అందుకే విద్యుత్ ఛార్జీల తగ్గించే విషయంలో ఓ హామీ ఇవ్వలేకపోతున్నామని నిర్వేదం వ్యక్తం చేశారు.  యువ గళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరులో వ్యాపరస్తులతో నారాలోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

రాష్ట్రంలో ఆస్తిపనున్ను మరింత పెంచబోతున్నారని, బొత్స మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకు వచ్చిన చట్టం ద్వారా ఆస్తి పన్నును పెంచుతున్నారని, ఈ చట్టం వద్దని నాడు శాసన మండలిలో తాము డిమాండ్ చేసినా తమ మాట వినలేదని చెప్పారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ఆస్తి పన్ను తగ్గిస్తామని, ఓ శాస్త్రీయ విధానాన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు, పన్నులు పెంచలేదని గుర్తు చేశారు.

పోలీసులకు గంజాయి అమ్మేవారిని అరెస్టు చేయడానికి తీరిక లేదని, కానీ ఎవరైనా ప్రభుత్వంపై పోస్టులు పెడితే వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారని, అధికార పార్టీ సేవలో పోలీసులు మునిగిపోయి ఉన్నారని మండిపడ్డారు. తనపై  కోడా ప్రభుతెం ఎన్నో కేసులు పెట్టిందని చివరకు 302 కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని వెల్లడించారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే తన పాదయాత్రకు కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా అపూర్వ స్పందన వచ్చిందన్నారు.  దీనికి జగన్ కు థాంక్యూ చెప్పాల్సి ఉందన్నారు.  తనపై ప్రజలు నమ్మకం పెట్టుకుంటున్నారని, దాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. బాబుగారిని ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్నది సిఎం జగన్ లక్ష్యమని, కానీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్