Saturday, November 23, 2024
HomeTrending Newsతప్పు తేలితే కఠిన చర్యలు: భరత్

తప్పు తేలితే కఠిన చర్యలు: భరత్

గోరంట్ల మాధవ్ ది ఫ్యాబ్రికేటేడ్ వీడియోనా? అసలుదా అన్నది తేలాల్సి ఉందని, దానిపై స్పష్టత వచ్చిన తరువాతే దీనిపై మాట్లాడితే బాగుంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చెప్పారు.  తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మాధవ్ తప్పు  చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీలో సహచర వైసీపీ ఎంపీలతో కలిసి మీడియాతో భరత్ మాట్లాడారు.

రాష్ట్రానికి నిధులు రాకుండా తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని భరత్ ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరగలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని, ఈ మేరకు టిడిపి ఎంపీ రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని తెలిపారు. పోలవరం డయా ఫ్రమ్ వాల్ దెబ్బదినడానికి చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమని, కాఫర్ డామ్ కట్టకుండానే డయా ఫ్రమ్ వాల్ కట్టారని చెప్పారు. ఎఫ్ ఆర్ బీఎం పరిమితికి మించి ఏపీ అప్పులు చేస్తోందన్న వార్తల్లో నిజం లేదని భరత్ అన్నారు.

విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని, దీనిపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.  రెవెన్యూ లోటు కింద 22వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకూ 4 వేల కోట్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన 18వేల కోట్లు వెంటనే మంజూరు చేయాలని భరత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన 6,627 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇప్పించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు.  కేంద్రం రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని, కానీ జనాభా లెక్కల ప్రకారం ఇంకా 13 మెడికల్ కాలేజీలు రావాల్సి ఉందని, వీటిని వెంటనే కేటాయించాలని కోరారు.

Also Read తప్పు తేలితే కఠిన చర్యలు: సజ్జల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్