Saturday, March 29, 2025
Homeవార ఫలాలువార ఫలాలు

వార ఫలాలు

23-03-2025 నుండి 29-03-2025 వరకూ

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక లబ్ది ఉంది. జీవనోపాధికి మేలిమి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచన ఉంది. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. అప్పులు తిరిగి చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సంతాన సంబంధ శుభవార్త వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దూర ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. అనవసర ఖర్చును తగ్గించండి.

వృషభం (Taurus):
అభీష్టం నెరవేరుతుంది. ఇతర కార్యాలు కూడా సఫలం అవుతాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. గౌరవం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. అప్పలను కొంతమేర తీర్చే పరిస్థితి కనిపిస్తోంది. శత్రుపీడ తగ్గుతుంది. కుటుంబంలో శుభకార్యాచరణ గురించి ఆలోచిస్తారు. ఆత్మీయులతో వినోదంగా గడుపుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులు తోడుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం (Gemini):
వ్యవహారాలు సజావుగానే సాగుతాయి. కోరిన కార్యం నెరవేరుతుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే తగిన ఫలితాన్ని పొందుతారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టగలుగుతారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో స్థిరనివాస యత్నాలు కొలిక్కి వస్తాయి. అధికారాలు పెరుగుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది. అనవసర వ్యవహారాల్లో పంతానికి వెళ్లకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు వాయిదా పడే సూచన ఉంది.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కీలక ప్రయత్నాలన్నీ ఫలవంతం అవుతాయి. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వినోదకరంగా సాగుతాయి. సంతానం వృద్ధిలోకి వస్తుంది. సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పంతాలకు పోవద్దు. పోటీల్లో పాల్గొనకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆధ్యాత్మికత పెరుగుతుంది.

సింహం (Leo):
వ్యవహార జయం ఉంది. చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. ధనలాభం ఉంది. ఉపాధి మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వస్తుప్రాప్తి ఉంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తొలగి మనసు ప్రశాంతమవుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన కాలం. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వారం చివరలో ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి.

కన్య (Virgo):
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వాయిదా పడుతోన్న కార్యం సఫలమయ్యే సూచన ఉంది. బంధువుల సహకారం లభిస్తుంది. న్యాయ వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కీలక నిర్ణయంలో అదృష్టం తోడవుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు వినోదంగా సాగుతాయి. కొత్త పరిచయాలు బలపడతాయి. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో వినోదాల్లో గడుపుతారు. సంతానం తీరు కాస్త ఇబ్బంది పెట్టినా సర్దుకుంటుంది. ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది.

తుల (Libra):
పనులు అనుకున్నట్లే సాగుతాయి. ధనలాభమూ గోచరిస్తోంది. మీ పురోగతికి బంధువులు సహకరిస్తారు. కీలక వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. స్థిరాస్తికి సంబంధించిన క్రయవిక్రయాల్లో నష్టం గోచరిస్తోంది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. న్యాయ వివాదాల్లో తలదూర్చకండి. అయినవారితోనే విరోధం ఏర్పడే అవకాశం ఉంది. పూచీగా ఉంటే నష్టమేంటో తెలుస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. వాహన సంబంధంగా పరిహారం చెల్లించే పరిస్థితి ఉంది.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
వ్యవహారాల్లో విశేష లాభం ఉంటుంది. కీలక సందర్భంలో సత్తా చాటుతారు. అందరి ప్రశంసలూ లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువులు సహకారంతో కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దుతారు. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ముఖ్య సమాచారం ఆనందాన్నిస్తుంది. విద్య, రియల్ ఎస్టేట్, మైనింగ్, సేవా రంగాల్లోని వారు తొందరపాటు వల్ల నష్టపోయే సూచన ఉంది. సంతాన సంబంధ విషయాల్లో సునిశితంగా వ్యవహరించండి. వృథా ఖర్చు తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

ధనుస్సు (Sagittarius):
చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలక సందర్భంలో మీలోని సత్తా బయటపడుతుంది. నాయకత్వ పటిమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. కీలక సమాచారం ఆనందపరుస్తుంది. ప్రయాణాలు వినోదంగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. మాట తప్పడం, పూచీగా ఉండడం వల్ల అవమానపడతారు. నోటిని అదుపులో ఉంచుకోండి. గుట్టు రట్టయ్యే సూచన ఉంది. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. మానసిక అశాంతి పెరుగుతుంది.

మకరం (Capricorn):
అనుకూల కాలం నడుస్తోంది. జీవితంలో ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక పదవిలోని వ్యక్తులు సహకరిస్తారు. అదృష్టం కూడా తోడవుతుంది. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ప్రియతముల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. సోదరులు తోడుగా ఉంటారు. ప్రయాణాలు సజావుగా సాగుతాయి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. అనవసర విషయాల్లో తలదూర్చకండి. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి.

కుంభం (Aquarius):
పనులు సజావుగా సాగుతాయి. ధనలాభముంది. గృహావసరాలను తీరుస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాల్య స్మృతులను మననం చేసుకుంటారు. ఇంటికి దూరంగా, ఒంటరిగా గడిపే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర జోక్యాల వల్ల డబ్బు నష్టమే కాకుండా అవమానాలూ ఎదురవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మాట నిలుపుకోని కారణంగా ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. మనశ్శాంతి ఉండదు.

మీనం (Pisces):
మేలిమి కాలం నడుస్తోంది. శుభవార్తలు అందుతాయి. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. అప్పులు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ గురించిన చర్చ సాగుతుంది. కీలక వ్యవహారంలో అదృష్టం తోడవుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. బాల్య స్నేహితులను కలుస్తారు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ప్రయాణాలు వద్దు.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్