12-01-2025 నుండి 18-01-2025 వరకూ
Weekly Horoscope in Telugu :
మేషం (Aries):
మీ ఆలోచనలకు కార్యరూపమిస్తారు. ధైర్యంతో చేపట్టే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో సోదరులు మద్దతుగా నిలుస్తారు. ఆత్మధైర్యం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం ఫలిస్తుంది. స్వశక్తితో పురోభివృద్ధి సాధిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. అవమానపడతారు. తగాదాలకు కూడా దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. వాత సంబంధ సమస్య ఉంటుంది. వాహన సంబంధ సమస్య తలెత్తుతుంది.
వృషభం (Taurus):
పనులు సవ్యంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విశేష లాభాలను పొందుతారు. కీలక వ్యవహారంలో సోదరులు అండదండగా ఉంటారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తోన్న సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. విలువైన వస్తువులు జాగ్రత్త. విడాకుల వ్యవహారం ఫలించదు.
మిథునం (Gemini):
ఎదుగుదలకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త విజ్ఞానాన్ని సంపాదించేందుకు అనువైన కాలమిది. వృత్తికి సంబంధించిన కీలక సమాచారం సంతోషాన్నిస్తుంది. బాల్యమిత్రులను కలుస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామితో పాటు సోదరుల సూచనలు మేలు చేస్తాయి. ఆధ్యాత్మిక అంశాల నుంచి ప్రేరణను పొందుతారు. అనవసరంగా ఎవరికీ పూచీలు ఇవ్వకండి. కంటికి సంబంధించిన సమస్య ఉంటుంది.
Weekly Horoscope in Telugu :
కర్కాటకం (Cancer):
ఆశించిన స్థాయిలో పనులు సాగుతాయి. అవసరాలకు తగినంత డబ్బు సమకూరుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో విందుకు హాజరవుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. శారీరక సౌందర్యంపై అనురక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండండి.
సింహం (Leo):
వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొంత మొత్తాన్ని పొదుపు చేయగలుగుతారు. శత్రుపీడ తగ్గుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాచరణ గురించి ఆలోచిస్తారు. ఆకాంక్ష నెరవేరుతుంది. కీలక సమయంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. విందుల్లో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నిద్రలేమి వేధిస్తుంది.
కన్య (Virgo):
అభీష్టం నెరవేరుతుంది. అన్ని కార్యక్రమాల్లోనూ అనుకూల ఫలితాలను పొందుతారు. ఇతరులతో తలెత్తే విభేదాల్లో మీదే పైచేయి అవుతుంది. ఉన్నత పదవిలోని వారి అభిమానాన్ని పొందుతారు.ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు.
తుల (Libra):
స్థిర చిత్తంతో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. వృత్తి నైపుణ్యానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాన్నిస్తాయి. మేలిమి అవకాశాలు అందివస్తాయి. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. బంధాలు బలపడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. ఆధ్యాత్మికచింతన పెరుగుగుంది.
Weekly Horoscope in Telugu :
వృశ్చికం (Scorpio):
వ్యవహారాల్లో మేలిమి ఫలితాలను పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. అధికారుల అభిమానంతో ఉద్యోగులు చక్కటి రివార్డులను పొందుతారు. అధికార వృద్ధి ఉంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. దూర ప్రదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ప్రభుత్వం నుంచి అవసరమైన లబ్ది లభిస్తుంది. నైపుణ్యానికి తగ్గ గుర్తింపును పొందుతారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలను నమ్మకండి. అపార్థాలను తొలగించే ప్రయత్నాలు మేలు చేస్తాయి.
ధనుస్సు (Sagittarius):
వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ధన సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసికశాంతి లభిస్తుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. ఇతరులతోనూ సత్సంబంధాలు పెరుగుతాయి. ప్రయాణం ఆనందకరంగా సాగుతుంది. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. సంతాన వ్యవహారాలు సంతోష పెడతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా పోటీలకు దిగకండి. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయడం మేలు. బలహీనతలను జయించాలి.
మకరం (Capricorn):
మేలిమి కాలం నడుస్తోంది. వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. నూతన వస్తుప్రాప్తి ఉంది. బంధువులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. బలహీనతలను జయిస్తారు. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. అపార్థాలు తొలగిపోతాయి. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. స్వేచ్ఛాజీవితాన్ని కోరుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. దూర ప్రాంత సందర్శన గోచరిస్తోంది. ఉద్రేకాన్ని తగ్గించండి. తగాదాలు వద్దు.
కుంభం (Aquarius):
మనోభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. నూతన వస్తువులను కొంటారు. విజ్ఞానాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణం లాభిస్తుంది. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. నిజాయితీకి తగ్గ ఫలితం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఎగుమతుల రంగంలోని వారికి లాభిస్తుంది. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. వాత సంబంధ సమస్యలుంటాయి.
మీనం (Pisces):
చర్చల ద్వారా వివాద పరిష్కారాలకు అనువైన సమయం. వ్యవహారాలు శుభప్రదంగా ఉంటాయి. మిత్రులు సహకరిస్తారు. శత్రువుల పీడ తగ్గుతుంది. అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల వ్యవహారాల్లో జాగ్రత్త. మీకు అండగా ఉంటారనుకున్న వారే దెబ్బతీస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. సంతానం తీరు చికాకు పెడుతుంది. వాహన సంబంధ సమస్య వస్తుంది. తల్లివైపు బంధువుల గురించిన వర్తమానం అందుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా దాచండి.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]