Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: బంగ్లాపై విండీస్ విజయం

మహిళల వరల్డ్ కప్: బంగ్లాపై విండీస్ విజయం

WI beat Bangla: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ 4 పరుగులతో  విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చివరి క్షణం వరకూ అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. అయితే జట్టులో ఐదుగురు బ్యాట్స్ విమెన్ డకౌట్ కావడంతో విండీస్ పైచేయి సాధించింది. విండీస్ బౌలర్లు హేలీ మాథ్యూస్ నాలుగు, ఫ్లెచెర్, కెప్టెన్ టేలర్ చెరో మూడు వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మౌంట్ మంగనూయీలోని బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  విండీస్ మహిళలు 29 వద్ద మొదటి వికెట్ కోల్పోయారు. తర్వాత కూడా వరుస వికెట్లు పోగొట్టుకున్నారు. జట్టులో కాంప్ బెల్లె 53 పరుగులతో అజేయంగా నిలిచింది. ఓపెనర్లు దాట్టిన్-17; హేలీ మాథ్యూస్-18; ఫ్లెచెర్- 17మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీనితో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో నహిదా అక్తర్, సల్మా ఖాతున్ చెరో రెండు; రుమానా అహ్మద్, రితూ మోనీ, జహనారా అమన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

బంగ్లాదేశ్ ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ (షమీనా సుల్తానా డకౌట్);  ౩౦ వద్ద రెండో వికెట్ (షమీన్ అక్తర్-17) కోల్పోయింది. అయితే 60 వద్ద ఒకేసారి మూడు వికెట్లు (హర్గానా హక్-23; రుమానా అహ్మద్ డకౌట్ , రీతూ మొనీ డకౌట్)  పోగొట్టుకుంది.  కెప్టెన్ నైగర్ సుల్తానా-25; చివర్లో నహిదా అక్తర్-25 నాటౌట్ మాత్రమే రాణించారు. బంగ్లా 49.3 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

హేలీ మాథ్యూస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

ఇవి కూడా చదవండి: మహిళల వరల్డ్ కప్:  సౌతాఫ్రికా  ఉత్కంఠ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్