Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్IND Vs. WI: తొలి టి 20లో విండీస్ విజయం

IND Vs. WI: తొలి టి 20లో విండీస్ విజయం

వెస్టిండీస్ తో ఐదు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియా 4 పరుగులతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగా లక్ష్య సాధనలో ఇండియా చతికిల పడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండు కీలక వికెట్లు తీసుకున్న జేసన్ హోల్డర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

విండీస్ 30 పరుగులకు ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. చాలాకాలం తర్వాత టి 20 ఆడుతోన్న యజువేంద్ర చాహల్ వీరిద్దరినీ ఎల్బీగా ఔట్ చేశాడు. జట్టులో కెప్టెన్ రోమన్ పావెల్ 48 (32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు); నికోలస్ పూరణ్- 41 (34 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు); బ్రాండన్ కింగ్ -28 పరుగులతో రాణించారు. ఇండియా బౌలర్లలో చాహల్, అర్ష్ దీప్ సింగ్ చెరో 2; హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో ఇండియా 6 పరుగులకే తొలి వికెట్  (ఇషాన్ కిషన్-6) కోల్పోయింది. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ కూడా 9 బంతులాడి కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. తెలుగు స్టార్ తిలక్ వర్మ సత్తా చాటి 22 బంతుల్లో 2 ఫోర్లు, 3  సిక్సర్లతో 39; సూర్య కుమార్ యాదవ్-21, పాండ్యా-19; అక్షర్ పటేల్ 11 బంతుల్లో  ఒక సిక్సర్ తో 13 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్న సమయంలో 19 వ ఓవర్ తొలి బంతికి ఒబెద్ బౌలింగ్ లో హెట్ మెయిర్ పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఇతని స్థానంలో వచ్చిన అర్ష్ దీప్ సింగ్ కూడా దూకుడుగా ఆడి ఏడు బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి… జట్టు విజయానికి 2 బంతుల్లో ఏడు పరుగులు కావాల్సిన దశలో రనౌట్ గా వెనుదిరిగాడు. దీనితో ఇండియాకు 4 పరుగులతో ఓటమి తప్పలేదు.

విండీస్ బౌలర్లలో హోల్డర్, షెఫర్డ్, ఒబెద్ మెక్ కాయ్ తలా 2; అకీల్ హోస్సేన్ 1 వికెట్ పడగొట్టాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్