Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్Aus Vs. WI: ఆసీస్ 511/7;  విండీస్ 102/4

Aus Vs. WI: ఆసీస్ 511/7;  విండీస్ 102/4

వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 511 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మూడు వికెట్ల నష్టానికి 330 పరుగుల వద్ద నేడు రెండోరోజు ఆటను ఆసీస్ మొదలు పెట్టింది. నిన్న సెంచరీలతో క్రీజులో ఉన్న లబుశేన్ (120); ట్రావిస్ హెడ్ (114)లు  నాలుగో వికెట్ కు మొత్తంగా 297 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. లబుషేన్-163; హెడ్-175 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ 41 పరుగులతో రాణించాడు. టీ విరామానికి ముందు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన లబుషేన్ రెండో టెస్టు తొలి ఇనింగ్స్ లో కూడా సెంచరీ సాధించి ఒకే సిరీస్ లో మూడు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల కెక్కాడు.

విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, థామస్ చెరో రెండు; హోల్డర్, బ్రాత్ వైట్ చెరో వికెట్ సాధించారు.

తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ 35 పరుగుల వద్ద  తొలి వికెట్ (కెప్టెన్ బ్రాత్ వైట్-19) కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. షమ్రా బ్రూక్స్-8; బ్లాక్ వుడ్-3; డివాన్ థామస్-19 పరుగులే చేసి పెవిలియన్ చేరారు. త్యాగి నారాయణ్ చంద్రపాల్-47, అండర్సన్ ఫిలిప్-1 పరుగుతోను క్రీజులో ఉన్నారు.

మైఖేల్ నాసర్ రెండు; లియాన్, గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్