Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC World Cup: స్కాట్లాండ్ చేతిలో ఓటమి - విండీస్ ఔట్!

ICC World Cup: స్కాట్లాండ్ చేతిలో ఓటమి – విండీస్ ఔట్!

వెస్టిండీస్ కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. వరల్డ్ కప్ కు అర్హత సాధించకుండానే నిష్క్రమించింది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నా… లీగ్ దశలో సరైన ప్రదర్శన లేకపోవడంతో ఫైనల్ -10లో విండీస్ కు బెర్త్ దక్కే అవకాశాలు లేవు.

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నేడు జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ సూపర్ సిక్స్  మ్యాచ్ లో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో విండీస్ పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన  విండీస్ 30 పరుగులకు నాలుగు వికెట్లు (జేమ్స్ చార్లెస్-0; షర్మా బ్రూక్స్- 0; బ్రాండన్ కింగ్- 22; కేల్ మేయర్స్- 5)  కోల్పోయింది. హోల్డర్-45;  రోమానియో షెఫర్డ్-36; నికోలస్ పూరణ్-21 మాత్రమే రాణించారు. 43.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాండన్ మెక్ ముల్లెన్ 3; క్రిస్ సోల్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా 2; సఫ్యాన్ షరీఫ్ ఒక వికెట్ పడగొట్టారు.

పరుగుల ఖాతా ప్రారంభించకముందే స్కాట్లాండ్ తొలి వికెట్ కోల్పోయినా…. రెండో వికెట్ కు మాథ్యూ క్రాస్-బ్రాండన్ మెక్ ముల్లెన్ లు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రాండన్ 69 రన్స్ చేసి ఔట్ కాగా, ఆ తర్వాత జార్జ్ మున్షీ-18 మాత్రమే చేసి వెనుదిరిగాడు.  క్రాస్-74, కెప్టెన్ బెర్రింగ్ టన్-13 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 43.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

బ్రాండన్ మెక్ ముల్లెన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్