Sunday, January 19, 2025
HomeసినిమాBRO: 'బ్రో' లో ఐటం సాంగ్ చేసేదెవరో?

BRO: ‘బ్రో’ లో ఐటం సాంగ్ చేసేదెవరో?

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఇటీవల బ్రో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ లుక్ రిలీజ్ చేశారు. దీనికి కూడా అనూహ్య స్పందన వచ్చింది. దీంతో బ్రో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఒక పాట, కొంత టాకీ బ్యాలెన్స్ ఉంది. తాజాగా పవన్, తేజ్ పై మిగిలిన టాకీ కంప్లీట్ చేస్తున్నారు. ఓరిజినల్ వెర్షెన్ కి సంబంధించిన కథలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఓ ఐటం సాంగ్ పెట్టారట. అయితే.. ఈ ఐటం సాంగ్ ను ఎవరితో చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని ఐటం సాంగ్ ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని తో చేయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చేయడం కోసం 3 నుంచి 4 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.

దిశా పటానీతో పాటు మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు.. శృతిహాసన్. ఈమెతో ఐటం సాంగ్ చేయించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. శృతిహాసన్ ఇటీవల ప్రభాస్ కు జంటగా సలార్ లో నటించింది. దిశా, శృతి ఈ ఇద్దరిలో ఎవరితో ఐటం సాంగ్ చేయనున్నారు అనేది త్వరలో ప్రకటించనున్నారు. జులై 28న బ్రో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్