Sunday, January 19, 2025
HomeసినిమాChiranjeevi: చిరంజీవితో మల్లిడి వశిష్ట్ మూవీ?

Chiranjeevi: చిరంజీవితో మల్లిడి వశిష్ట్ మూవీ?

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.  చిరుకు జంటగా జంటగా మిల్కీబ్యూటీ తమన్నా… చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆగష్టు 11న  ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేస్తారనేది ప్రకటించలేదు కానీ.. కొంత మంది దర్శకుల పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. వెంకీ కుడుముల, పూరి జగన్నాథ్,  వివి వినాయక్ పేర్లు   వినిపించాయి. మారుతితో సినిమా ఉంటుందని కూడా గతంలో వినిపించినా దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు.
కళ్యాణ్ రామ్ తో బింబిసార చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సాధించిన మల్లిడి వశిష్ట్ చిరంజీవితో మూవీ చేస్తున్నారనేది తాజా వార్త. కానీ దీనిలో వాస్తవం లేదని తెలిసింది. వశిష్ట్ ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు కథ రెడీ చేస్తున్నాడట. త్వరలోనే నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటిస్తాడట. అలాగే చిరు కోసం కొంత మంది దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. మరి.. చిరు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్