Sunday, January 19, 2025
Homeసినిమాచిరు, బాలయ్య.. విజేతగా నిలిచేది ఎవరు?

చిరు, బాలయ్య.. విజేతగా నిలిచేది ఎవరు?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు విడుదల అవుతున్నాయి. జనవరి 12న వీరసింహారెడ్డి చిత్రం విడుదల అవుతుంటే.. జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఒక రోజు గ్యాప్ లో చిరు, బాలయ్య పోటీపడుతుండడంతో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు సినిమాల టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్స్ కు అనూహ్య స్పందన లభించింది. అలాగే రెండు సినిమాలకు బజ్ బాగా ఉంది.

ఈ రెండు చిత్రాల్లో కథానాయిక శృతి హాసన్ కావడం ఓ విశేషమైతే.. ఈ రెండు చిత్రాలను ఓకే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం మరో విశేషం. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి, బాలకృష్ణలతో ఓకే సంస్థ నిర్మించిన చిత్రాలు సంక్రాంతికి పోటీపడడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే… చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాను చిరంజీవి అభిమాని బాబీ తెరకెక్కించారు. అలాగే బాలకృష్ణతో వీరసింహారెడ్డి చిత్రాన్ని బాలయ్య అభిమాని మలినేని గోపీచంద్ తెరకెక్కించారు. దీంతో ఏ సినిమా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది..?  ఎవరు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారు..? అనేది అందరిలో ఉత్కంఠ కలిగిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. ఇద్దరు అభిమానులు పోటీపడి హంగామా చేస్తున్నారు. సంక్రాంతికి ఈ రెండు సినిమాలతో పాటు తమిళ చిత్రాలు విజయ్ వారసుడు, అజిత్ తెగింపు కూడా విడుదల కానున్నాయి. అలాగే చిన్న సినిమా కళ్యాణం కమనీయం అనే సినిమా కూడా విడుదల అవుతుంది. దీంతో ఈ సంక్రాంతికి సినీ ప్రియులకు సినిమాలు మరింతగా ఆనందం కలిగించేందుకు రెడీ అయ్యాయి. మరి.. సంక్రాంతికి చిరు, బాలయ్య ఇద్దరూ విజేతలుగా నిలుస్తారో.. లేక ఇద్దరిలో ఎవరో ఒకరే విజేతగా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్