Monday, January 20, 2025
Homeసినిమాఅటు బాలయ్య .. ఇటు చిరూ .. మధ్యలో పూరి!

అటు బాలయ్య .. ఇటు చిరూ .. మధ్యలో పూరి!

పూరి జగన్నాథ్ రచయితగా .. దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఇక అప్పుడప్పుడు ఫ్లాపులు పడటం .. వాటి మధ్యలో హిట్లు పడటం ఇక్కడ జరుగుతూ ఉండేదే. ఒక కథను రెడీ చేసుకోవడంలో .. డైలాగ్స్ రాసుకోవడంలో .. తెరకెక్కించడంలో పూరి కంటూ ఒక మార్క్ ఉంది. ఆయన సినిమాల్లో లోతైన ఎమోషన్స్ .. బలమైన సాహిత్యలేం కనిపించవు. సాధారణ ప్రేక్షకులు సైతం అర్థం చేసుకుని ఎంజాయ్ చేసేలా ఉంటాయి. అదే పూరి ప్రత్యేకత .. అదే ఆయన బలం కూడా.

అలాంటి పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత ఆ స్థాయి హిట్ ను నమోదు చేయలేకపోయాడు. అందువలన అదే సినిమాకి సీక్వెల్ తీసే పనిలో ఇప్పుడు ఉన్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ఆ తరువాత ఆయన సినిమా చిరంజీవితోగానీ, బాలకృష్ణతో గాని ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ బాలయ్యతో ఆయన ‘పైసా వసూల్’ చేశాడు. డిఫరెంట్ స్టైల్లో బాలయ్యను చూపించడంలో సక్సెస్ అయ్యాడు.

బాలయ్యతో మరోసారి చేయనున్నట్టు అప్పటి నుంచి కూడా వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులతో బాలయ్య ఉన్నారు. మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఆయన పూరితో చేయడానికి రెడీగానే ఉన్నారనే సంకేతాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ఒక సందర్భంలో తమ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందని పూరిని మెగాస్టార్ అడిగారు. ఆయనకి ఓ లైన్ చెప్పడం .. ఓకే అనిపించుకోవడం జరిగిపోయిందని అంటున్నారు. అటు చిరూ .. ఇటూ బాలయ్యలలో పూరి ఎవరి ప్రాజెక్టును ముందుగా సెట్స్ పైకి తీసుకుని వెళతాడనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్