Saturday, January 25, 2025
HomeTrending NewsNCP: శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం

NCP: శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం

రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు, నేషనలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను NCP చీఫ్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని పవార్‌ ఇవాళ ఉదయం ప్రకటించారు. గత కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత కుమ్ములాటు పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. శరద్‌పవార్‌ సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ పార్టీపై తిరుగుబాటు చేస్తారని జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్న సమయంలో శరద్‌పవార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే శరద్‌పవార్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే, పవార్‌ ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? ఆయన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే తన వారసుడిగా లేదా వారసురాలిగా ఎవరికి ఆ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్