Saturday, January 18, 2025
Homeసినిమాజ‌పాన్ లో ర‌జ‌నీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

జ‌పాన్ లో ర‌జ‌నీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌,  రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఈ సినిమా 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు ఈ  మూవీ జ‌పాన్ లో అక్టోబ‌ర్ 21న భారీగా విడుద‌లైంది. ఇది వరకే  రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను అక్కడ విడుదల చేయగా మంచి కలెక్షన్స్ అందుకుంది. ‘సాహో’ సినిమా కూడా విడుదల అయింది. అది కూడా జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

అయితే.. ఇటీవల కాలంలో ఎన్ని సినిమాలు జపాన్లో విడుదలవుతున్నా కూడా 27 ఏళ్ల క్రితం రజనీకాంత్ క్రియేట్ చేసిన రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోతున్నాయి. 1995లో రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ సినిమా జపాన్ లో విడుదల అయింది. అక్కడ ఈ సినిమా ¥400M మిలియన్ల కలెక్షన్స్ అందుకుంది. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 20 కోట్లతో సమానం. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ర‌జ‌నీ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ అలాగే దర్శకుడు రాజమౌళి కూడా అక్కడ సినిమాను బాగా ప్రమోట్ చేసేందుకు వెళ్లారు. ప్రమోషన్స్ లో వారికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది వరకే ట్రైలర్ విడుదల చేయగా మంచి క్రేజ్ అందుకుంది. ఈ మూవీ అక్క‌డ రిలీజ్ కాకుండా.. ఆర్ఆర్ఆర్ కు ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారంటే.. ఎంత‌లా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.  మరి ఈ సినిమా ర‌జ‌నీ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

Also Read : జ‌పాన్ లో ఆర్ఆర్ఆర్ త్ర‌యం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్