Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Brandon King Century: యూఏఈపై విండీస్ విజయం

Brandon King Century: యూఏఈపై విండీస్ విజయం

వెస్టిండీస్ – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  మూడు వన్డేల సిరీస్ లో బాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ 47.1 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది.

విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ 112 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులతో సత్తా చాటగా, షమ్రా బ్రూక్స్-44; జాన్సన్ ఛార్లెస్-24 రన్స్ చేశారు. కీసీ కార్టీ-7; కెప్టెన్ షై హోప్-13 తో క్రీజులో నిలిచారు.

అంతకుముందు ఎమిరేట్స్ పరుగుల ఖాతా మొదలు పెట్టకముందే తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయింది. జట్టులో అలీ నాజర్-58; అరవింద్-40; ఆసిఫ్ ఖాన్-27 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 3; డొమినిక్ డ్రేక్స్, ఓడియన్ స్మిత్, కరై తలా 2; రోస్టన్ చేజ్ ఒక వికెట్ పడగొట్టారు.

బ్రాండన్ కింగ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్