Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు - జీవన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు – జీవన్ రెడ్డి

Women Protest  : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా ధరలు పెంచి పేద ప్రజల నడ్డివిరుస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే, నేటి బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు పేదలపై ధరల రూపంలో పెనుభారాన్ని మోపుతున్నాయని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వాలు అన్నింటిపై ధరలు పెంచి భారం మోపడం సమంజసం కాదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పులతో ఈ రోజు నిరసనలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం, విధ్యుత్ ఛార్జిలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండల కేంద్రంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. జీవన్ రెడ్డి సిలిండర్ ఎత్తుకుని నాయకులతో రాయికల్ లో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై వంటవార్పు కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నాయకులు భోజనాలు చేశారు.
ఈసందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలపై పెనుబారం మోపిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి సామాన్యులకు , రైతులకు, అన్నీ వర్గాల వారిపై విద్యుత్ భారం మోపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా మారాయని ఆరోపించారు.

కార్యక్రమంలో గోపు మాధవి, రవీందర్ రావు, గంగారెడ్డి, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ ఆధ్వర్యంలో ఇందిరా భవన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వచ్చి కొంత సేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ ఆందోళన చేశారు.మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మెన్ మన్సూర్ అలీ సిలిండర్ ను భుజానవేసుకుని నిరసన తెలిపారు. మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొని వంటవార్పు చేపట్టారు. బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు పార్టీలు వేరైనా ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం,విజయ లక్ష్మీ, కళ్ళేపెల్లి దుర్గయ్య, బండ శంకర్, నక్కజీవన్, జున్ను రాజేందర్,మన్సూర్, కొత్త మోహన్ తదితరులు విమర్శించారు.పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బిజెపి, టిఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మేపరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులుతాటిపర్తి దేవేందర్ రెడ్డి, గాజుల రాజేందర్,అల్లాల రమేష్ రావు, బింగి రవి, చిట్ల అంజన్న, పులి రామ్,గుండా మధు, రమణ,అల్లాల సరిత,రజిత, చిట్ల లత, బింగి సుమ, మొగిలి, బీరం రాజేష్, నేహాల్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
గొల్లపల్లి, ధర్మపురి, బుగ్గారం, కోరుట్ల, సారంగాపూర్, మెట్పల్లి తదితర మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు.వేముల సుభాష్, నర్సాగౌడ్, రామ గౌడ్, రహమాత్ ఖాన్, ముస్కు నిశాంత్ రెడ్డి, సర్పంచ్ సత్యనారాయణ, కొండ్ర రాంచంద్రరెడ్డి,తో పాటు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు.

Also Read : తోలు వలిచే టోలు గేట్లు   

RELATED ARTICLES

Most Popular

న్యూస్