Friday, November 22, 2024
HomeTrending Newsశరవేగంగా కరోనా థర్డ్ వేవ్

శరవేగంగా కరోనా థర్డ్ వేవ్

కరోనానా! ఎక్కడా?తగ్గిపోయిందిగా! నాకు వాక్సిన్ అయిపోయింది. ఏమీ కాదు! ఊరికే భయపెడతారు గానీ థర్డ్ వేవ్ రాదు గాక రాదు…మొదటినుంచీ మనవాళ్లది ఇదే ధోరణి. ముందు మన దాకా రాదనుకున్నారు. వచ్చాక మన ఊరు రాదనుకున్నారు. అదీ అయ్యాక మన ఇంటికి రాదనుకున్నారు. ఆ తర్వాత సన్నిహితుల మరణాలతో కాస్త ఇంటిపట్టున ఉండటం నేర్చుకున్నారు. ఏం లాభం?..

కొన్ని రోజులుగా అంతా సందడి కనిపిస్తోంది. పెళ్లిళ్లు జోరందుకున్నాయి. పూజలు, వ్రతాలు, పబ్బుల్లో పార్టీలు, ట్రిప్పులు … అన్నీ జరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసారుకదా భయం లేదనే భావన పెరుగుతోంది. మరోపక్క కరోనా తగ్గలేదు, థర్డ్ వేవ్ పొంచి ఉందని నిపుణులు చెప్తున్న మాటలు ఎవరూ వినిపించుకోవడం లేదు. అక్కడికీ ఒకాయన ఈసారి ఇంటికో మరణం ఉంటుందని భయపెట్టాడు. కొద్ది రోజులు వేచి చూడమన్నా ఆ జాగ్రత్తలు మాకు కాదనుకుంటున్నారు. పైగా పాటించేవారిని చాదస్తులుగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సీఈవో సౌమ్యా స్వామినాథన్ తాజా హెచ్చరిక అలారం మోగిస్తోంది. అనేకదేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని, కరోనా నిబంధనలు పాటించకపోవడం, వ్యాక్సిన్ల కొరత ఇందుకు కారణమని సౌమ్య తెలిపారు. అందరూ అనుకుంటున్నట్టు కరోనా నెమ్మదించలేదని, మళ్ళీ వేగంగా పెరుగుతోందని చెప్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్