Tell the Fact: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వాస్తవాలను దాచిపెడుతున్నారని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పడుతున్నారని, వాస్తవంగా జరుగుతున్నదేమిటనే విషయాన్ని మరుగున పెడుతున్నారని విమర్శించారు. అడ్డ దారుల్లో అప్పులు తెస్తూ రాజ్యంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అందిస్తోన్న నిధులను జగన్ ప్రభుత్వం తమ సొంత పథకాలకు ఇష్టారీతిగా దారి మళ్ళించి, నగదు బదిలీల ద్వారా ప్రజా ప్రయోజనాలను దెబ్బ తెస్తోందని యనమల అన్నారు. 15వ ఆర్ధిక సంఘం నుంచి వచ్చిన 6 వేల కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద వచ్చిన 7 వేల కోట్ల రూపాయలు ఎం చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీ చేస్తున్న అప్పులు, నిధుల వినియోగంపై కేంద్రం, నీతి ఆయోగ్ సంస్థలు ఆర్బీఐ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమిటో బహిర్గతం చేయాలని కోరారు.
Also Read : సిఎం జగన్ లండన్ టూర్ మిస్టరీ…యనమల విమర్శ