Sunday, January 19, 2025
HomeTrending Newsగాడిలో పెట్టండి: యనమల సూచన

గాడిలో పెట్టండి: యనమల సూచన

Yanamala on  Financial Situation

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలని టిడిపి సీనియర్ నేత, మాజీ ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. రాష్ట్రం, ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని, ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని యనమల నేటి ఉదయం దర్శించుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేకపొతే పెట్టుబడులు రావని, దీనితో నిరుద్యోగం పెరుగుతుందని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని, ప్రజలను ఆదుకోవాల్సిందిగా శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారమవుతుందని, ఇప్పటికే ఆ సూచనలు కనబడుతున్నాయని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు అభివృద్ధిలో, పెట్టుబడుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండేదని, ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరుకున్నామని, దీన్ని సరిదిద్దకపోతే భావితరాలు తీవ్రంగా నష్టపోతాయని అభిప్రాయపడ్డారు.

Also Read : నేడు తిరుమలకు సిఎం జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్