గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన నిన్న హైదరాబాద్ లో టిడిపి అధినేత చంద్రబాబు ను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశారు. బాబు సూచన మేరకు ఆయన నేడు లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు.
యువ గళంలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తోన్న నారా లోకేష్ నేడు బసచేసిన నిడమానూరు శివారులోని పాదయాత్ర క్యాంప్ సైట్ వద్ద నారా లోకేష్ ను కలుసుకున్నారు. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు లోకేష్.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గద్దె అనురాధ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, వంగవీటి రాదా, బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు,
పాదయాత్ర రేపు 22 న గన్నవరం నియోజకవర్గంలో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలోని ఎస్ ఏం కన్వెన్షన్ హాల్ పక్కన బహిరంగసభ జరగనుంది. ఈ సభలోనే యార్లగడ్డకు గన్నవరం టికెట్ ను లోకేష్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.