దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ మూవీ ‘కేజీఎఫ్‘. ఈ సినిమా బాలీవుడ్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ సాధించడంతో హీరో యశ్ కు భారీగా క్రేజ్ ఏర్పడింది. కేజీఎఫ్ తర్వాత యశ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. బడా ఫిల్మ్ మేకర్స్ యశ్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు. అయితే.. యశ్ మాత్రం కన్నడ డైరెక్టర్ తోనే సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది. కేజీఎఫ్ తో వచ్చిన క్రేజ్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా మూవీ చేయాలని.. అందుకు తగ్గ కథ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశాడు.
పాన్ ఇండియా స్టార్స్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా రేంజ్ కి తగ్గ స్టోరీ ఎంచుకోవాలని ట్రై చేస్తున్నారు. అందుకనే తారక్, కొరటాల మూవీ ఆలస్యం అవుతుంది. అయితే.. యశ్ నెక్ట్స్ మూవీ పై క్లారిటీ ఇచ్చారు. KVN ప్రొడక్షన్స్ అనే కన్నడ నిర్మాణ సంస్థ మఫ్టీ దర్శకుడు నర్తన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రొడక్షన్ హౌస్ దీనికి సంబంధించి టీజర్ పోస్టర్ను కూడా విడుదల చేసింది. యశ్ 19వ సినిమా అని.. ప్రకటించి రిలీజ్ చేసిన పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. దీంతో యశ్ అభిమానుల వెయిటింగ్ కి తెర పడినట్టు అయ్యింది.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో యశ్ మూవీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో దిల్ రాజు బ్యానర్ లో యశ్ నెక్ట్స్ మూవీ ఉంటుంది అనుకున్నారు కానీ.. కెవిఎన్ బ్యానర్ లో సినిమాని ఓకే చేశారు. ఈ ఆకస్మిక ప్రకటన చాలా మందిని షాక్ కి గురి చేస్తోంది. భారీ తారాగణంతో,, భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ సినిమాతో రాకీ భాయ్ మరోసారి సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.