Thursday, September 19, 2024
Homeసినిమాఆకట్టుకుంటున్న గ్యాంగ్ స్టర్ గంగరాజు 'ఎల్లా..ఎల్లా' సాంగ్

ఆకట్టుకుంటున్న గ్యాంగ్ స్టర్ గంగరాజు ‘ఎల్లా..ఎల్లా’ సాంగ్

Ella Ella song:
‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో లక్ష్ చదలవాడ. అంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించి, విమర్శకుల ప్రశంశలు సైతం అందుకున్నాడు. లక్ష్ తాజా చిత్రం ‘గ్యాంగ్ స్టర్ గంగ రాజు’. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘చదలవాడ బ్రదర్స్’ సమర్పణలో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా నుంచి మరో పాట కూడా విడుదలైంది. ‘ఎల్లా ఎల్లా’ అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పాటకి సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం సమకూర్చారు. పీసి ఖన్నా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

Also Read : బాల‌య్య‌ అఖండ మూడో రోజు క‌లెక్ష‌న్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్