Monday, June 8, 2026
HomeTrending Newsఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పాల్గొని, యోగా ఆసనాలు వేశారు. దేశ రాజధాని దిల్లీ త్యాగరాజ స్టేడియంలో దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్​ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

Yoga For Humanity

మైసూర్‌లో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. అందరిదన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. భారత ప్రత్యేకత, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింభిస్తుందని, కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్నారు. యోగా దినోత్సవం అనేది ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచికన్నారు. కొన్నేళ్ల క్రితం ఇండ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించిందన్నారు.

 

భారత సైన్యం నేతృత్వంలో యోగ వేడుకలు దేశ సరిహద్దుల్లో ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత శైవ క్షేత్రం అమరనాథ్ గుహల వద్ద భారత సైన్యం నిర్వహించిన యోగ వేడుకలు దేశ ప్రజల ప్రశంసలు అందుకున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular