Saturday, January 18, 2025
HomeTrending Newsయోగి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం

యోగి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం

ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి లక్నో నగరం ముస్తాబైంది. నగరంలోని క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 85 వేల మంది అధితులకు అనువుగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. నయా భారత్ కా నయా యుపీ నినాదంతో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు  స్టేడియం చుట్టుపక్కల ఫ్లెక్స్ లు వెలిశాయి.  ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఈ రోజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 45 మంది మంత్రులతో రేపు రికార్డు స్థాయిలో రెండవసారి యోగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో సమతూకం పాటించేందుకు పార్టీ నేతలతో ఢిల్లీలో సమావేశమైన యోగి తన టీమ్ మెంబర్స్ పేర్లను ఇప్పటికే ఫైనల్ చేశారని సమాచారం. ఈ రోజు రాత్రికి మంత్రులుగా అవకాశం వచ్చిన నేతలకు అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు.

ఉప ముఖ్యమంత్రుల పేర్లపై బీజేపీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న కేశవ్ మౌర్య, దినేష్ శర్మలను కొనసాగిస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. యూపీలో పార్టీ OBC ప్రముఖుల్లో ఒకరైన మౌర్య ఇటీవలి ఎన్నికలలో ఓడిపోయారు, అయితే శర్మ పోటీ చేయలేదు. ఏది ఏమైనప్పటికీ, బీజేపీ నాయకత్వానికి సన్నిహితంగా ఉన్నారని విశ్వసించే మౌర్య ఆశించడానికి కారణం ఉంది – ఉత్తరాఖండ్‌లో, బీజేపీ పుష్కర్ సింగ్ ధామిని ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ తిరిగి ముఖ్యమంత్రిగా నియమించటంతో తిరిగి మౌర్య కు పదవి దక్కుతుందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read : ఉత్తరాఖండ్ సిఎంగా దామి ప్రమాణ స్వీకారం

RELATED ARTICLES

Most Popular

న్యూస్