Saturday, January 18, 2025
Homeసినిమాయంగ్ హీరోల వైపు నుంచి పెరుగుతున్న గ్యాప్!

యంగ్ హీరోల వైపు నుంచి పెరుగుతున్న గ్యాప్!

ఒకప్పటి హీరోలు కెరియర్ పరంగా గ్యాప్ రానిచ్చేవారు కాదు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు పొలోమంటూ సినిమాలు చేస్తూ వెళ్లారు. అప్పట్లో గెటప్పు ప్రధానమైన జోనర్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నప్పటికీ, వాళ్లు తమ స్పీడ్ ను కొనసాగించారు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున దగ్గరికి వచ్చేసరికి, ట్రెండ్ మారిపోయింది. ఉన్న జోనర్లనే ఈ నలుగురు హీరోలు ఉరకలు పరుగులు పెట్టించారు. ఇప్పటికీ వారు అదే స్పీడ్ ను కొనసాగిస్తున్నారు.

ఇక ఈ తరం హీరోల విషయానికి వస్తే, కొత్తదనం కోసం యంగ్ హీరోలు ట్రై చేస్తున్నారు. కాకపోతే ఆ కొత్తదనం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఫలితంగా ఆడియన్స్ తో గ్యాప్ పెరిగిపోతోంది. నిజంగానే గతంలో మాదిరిగా ఇప్పుడు ఏదో ఒక సినిమా చేస్తే చూసే పరిస్థితి లేదు. కచ్చితంగా కంటెంట్ కొత్తగా కనిపించవలసిందే. ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలి అనిపించే కొత్త అంశం ఉండవలసిందే. అందుకే హీరోలు ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నారు.

ఈ విషయంలో కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడానికి కూడా హీరోలు సంశయించడం లేదు. ఇక విషయం ఉన్న కంటెంట్ ను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదు. అయితే ఎటొచ్చి ఒక ప్రాజెక్టు అన్ని వైపుల నుంచి ముందుకు కదలడానికే ఎక్కువ సమయాన్ని తీసుకుంటోంది. దాంతో సహజంగానే కొంతమంది యంగ్ హీరోలకు గ్యాప్ వచ్చేస్తోంది. ఆ జాబితాలో నాగశౌర్య .. శర్వానంద్ .. అడివి శేష్ .. నిఖిల్ .. అఖిల్ .. ఇలా కొంతమంది హీరోలు కనిపిస్తున్నారు. ప్రస్తుతం వారు చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి మరింత ఆలస్యం అవుతుంది. మరి ఈ హీరోలంతా ఈ గ్యాప్ ను ఎలా తగ్గిస్తూ వస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్