Sunday, January 19, 2025
HomeTrending NewsYS Jagan: వారి చిరునామా ఏపీ కాదు: బాబు, పవన్ లపై జగన్ ధ్వజం

YS Jagan: వారి చిరునామా ఏపీ కాదు: బాబు, పవన్ లపై జగన్ ధ్వజం

చంద్రబాబును చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోందని, గత ఐదేళ్లల్లో ఆయన కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉండలేడని, కానీ ఇప్పుడు మాత్రం నెలరోజులుగా రాజమండ్రిలో ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసలు బాబు, లోకేష్‌, దత్తపుత్రుడు, బావమరిది బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉందని,  దత్తపుత్రుడి శాశ్వత చిరునామా కూడా హైదరాబాద్‌ లోనే ఉందని, వారి గజ దొంగల ముఠాలో ఉన్న మిగిలిన వారు కూడా మన రాష్ట్రంలో ఉండరని,  కానీ వీరికి కేవలం దోచుకోవడాని మాత్రమే మన రాష్ట్రం కావాలని విమర్శించారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు సిఎం జగన్ అందజేశారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ బాబు, పవన్ లపై జగన్ నిప్పులు చెరిగారు.

దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా హైదరాబాద్ అని, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు, నాలుగేళ్లకు మారుతూ ఉంటారని ధ్వజమెత్తారు. ఒకసారి లోకల్, ఇంకోసారి నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్ తర్వాత ఎక్కడికి వెళతారో అంటూ పవన్ పై సెటైర్ లు విసిరారు. ఆడవారు అన్నా, పెళ్ళిళ్ళ వ్యవస్థ అంటే ఏమాత్రం గౌరవం లేదని,  వీరంతా మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులని స్పష్టం చేశారు.

ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదని, ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదని మండిపడ్డారు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.  దోచుకున్నదిహైదరాబాద్‌లో పంచుకోవడం కోసమేనని అన్నారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమేనని,  తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడుని అన్నారు.

సరుకులు, సరంజామా అమ్ముకువే వాళ్ళను చూశామని, కానీ సొంత పార్టీని, సొంతవర్గాన్ని వేరే వారికి  అమ్ముకునే వ్యాపారిని ఈ పెద్ద మనిషి రూపంలో చూస్తున్నమంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. షూటింగ్ గ్యాప్ లో అప్పుడో ఎప్పుడో ఓ సారి వచ్చి వెళుతుంటారని, ఇలాంటి వ్యక్తికి మన రాష్టం అన్నా, మన ప్రజలన్నా, మన కాపులన్నా ఏమి ప్రేమ ఉంటుందో అందరూ అలోచించలేదన్నారు.

రాష్ట్రంపై, ప్రజలపై ప్రేమలేని వాళ్లు,  రాష్ట్రంలో కనిపించని వారు అనుక్షణం ఏపీ గురించి మాట్లాడుతుంటారని, బాబుకు అధికారం ఇవ్వలేదని కోపంతో ఊగిపోతున్నారని, అధికారం పోయే సరికి వీళ్లకు ఫ్యూజులు పోయాయని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్