Sunday, January 19, 2025
HomeTrending NewsYS Jagan: 175 సీట్లవైపు అడుగులు: జగన్ ధీమా

YS Jagan: 175 సీట్లవైపు అడుగులు: జగన్ ధీమా

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి 151 సీట్లు సాధించి నేటికి నాలుగేళ్ళు నిండాయి. 2019 మే 23న నాటి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 175 సీట్లకు గాను 151 సీట్లు సాధించి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తన మనోగతం పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతోనే  అడుగులు వేస్తున్నామని పునరుద్ఘాటించారు.

“దేవుడి ద‌య‌, మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో నాలుగేళ్ళ క్రితం మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. మీరు అప్ప‌గించిన బాధ్యతను మీకు సేవ చేసే అవ‌కాశంగా భావించి, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను మ‌న ప్ర‌భుత్వంలో ఒక్కొక్క‌టిగా అమ‌లు చేశాం. మ‌రోసారి మీకు సేవ చేసే అవ‌కాశం ల‌భించేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం” అంటూ సందేశం ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్