కేసీఅర్ ఒక గజ దొంగ అని ఎన్ని వాగ్ధానాలు ఇచ్చారు..ఎన్ని తప్పారని వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. 70 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం జగిత్యాల పాత బస్టాండ్ వద్ద YSR తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభలో షర్మిల…తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
షర్మిల ప్రసంగంలో ముఖ్యాంశాలు…ఆమె మాటల్లోనే…
మునుగోడులో ఓటు వేయకపోతే పెన్షన్ ఇవ్వరా..? ఎవడబ్బ సొమ్ము అని పెన్షన్ ఇవ్వరు..? KTR ఒక డ్రామా రావు..KTR ఒక 420. మాట ఇచ్చి మోసం చేసిన వాళ్ళను ఇలానే అనాలి. బీజేపీపై ఛార్జ్ షీట్ ఇవ్వడం సంతోషం..మరి మీ పాలనపై ఏ షీట్ ఇవ్వాలి.?
జగిత్యాలకు YSR ఎంతో చేశాడు. SRSP కాలువల మరమత్తులు చేయించి లక్షా 60 వేల ఎకరాలకు నీళ్ళు అందించారు. SRSP వరద కాలువను తవ్వించి మిడ్ మానెర్ నింపారు. గోదావరిపై ఎన్నో మినీ ఎత్తిపోతల పతకాలను ఏర్పాటు చేశారు. జగిత్యాలలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేశారు. జగిత్యాలలో jntu,అగ్రికల్చర్ కాలేజీ,డిగ్రీ కాలేజీలు,ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేయించారు. జగిత్యాలలో వాటర్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేయించారు. త్రాగునీటి సమస్య తీర్చారు. ఈ నియోజక వర్గంలో 22 వేల కుటుంబాలు గల్ఫ్ లో బ్రతుకు తున్నాయి. గల్ఫ్ బాధితుల కోసం వైఎస్సార్ ఎంతో తపించారు. గల్ఫ్ బాధితులను ఇప్పుడు కేసీఅర్ మోసం చేశారు. గతంలో గల్ఫ్ లో ఎవరైనా చనిపోతే వైఎస్సార్ airport లోనే లక్ష రూపాయల చెక్కు ఇచ్చేవాడు. ఇప్పుడు కేసీఅర్ 5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారు.. వైఎస్సార్ ఇచ్చే లక్ష చెక్కు కూడా ఆపివేశారు. గల్ఫ్ బాధితుల కోసం NRI సెల్ అని మోసం… 500 కోట్ల నిధి అని కెసిఆర్ మోసం చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే కంటి డాక్టర్..ఆయన కంటికి ఏమి కనిపించవు. ప్రజల సమస్యలు అసలు ఆయన కంటికి కనిపించవు. ఈ నియోజక వర్గంలో ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు. ఈయన స్వగ్రామం లో కూడా ఒక్క అభివృద్ధి లేదు. ఈయన సొంత గ్రామాన్ని కవిత దత్తత తీసుకుంది అంట కదా. ఇప్పటికీ ఈ ఎమ్మెల్యే గ్రామంలో YSR వేసిన రోడ్లు దిక్కు. నియోజక వర్గంలో కాంట్రాక్ట్ లు,అన్ని ఈయన గారి చుట్టాలకు ఇస్తారట. తెలంగాణలో సమస్యలు అన్ని పక్కన పెట్టీ ఇప్పుడు మునుగోడులో పడ్డారు.
మునుగోడులో ఒక్కో గ్రామానికి ఒక్కో ఎమ్మెల్యేకి ఇచ్చారు. కేసీఅర్ కూడా వెళ్ళాడు.. మునుగోడు లో గెలుస్తాం అనే నమ్మకం లేదనుకుంటా. బీజేపీ మీద తెగ రెచ్చి పోయారు. వడ్లను కొనడం చేతకాదు కానీ…ఎమ్మెల్యే లను కొంటారా అని రెచ్చిపోయాడు. డబ్బుల సంచులతో మా ఎమ్మెల్యే లను కొంటారా అని అంటున్నాడు. మునుగోడు ఎన్నికలు వచ్చే సరికి ఇప్పుడు కేసీఅర్ కి వడ్లు గుర్తుకు వచ్చాయి. వరి వేసుకుంటే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి మీరే కదా. కౌలు రైతులను రైతే కాదు అని చెప్పిన దుర్మార్గపు ముఖ్యమంత్రి మీరు. సబ్సిడీ విత్తనాలు..ఉచిత ఎరువులు అని చెప్పిన సన్నాసి మీరు. రుణమాఫీ చేయక రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే చూసి చూడనట్లు ఉన్న సన్నాసి మీరు. ఇక్కడి రైతులు రైతే కాదని..పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చిన సన్నాసి మీరు.
ఇప్పుడు కేసీఅర్ కూడా మునుగోడు అభివృద్ధి పై నాది భాధ్యత అంటున్నాడు. సీఎం కేసీఆర్ సిగ్గుందా..? మునుగోడు కర్ణాటకలో ఉందా…? మహారాష్ట్రలో ఉందా..? 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేక పోయారు. ఇప్పుడు ఎన్నికలు వస్తె మీకు అభివృద్ధి గుర్తుకు వచ్చిందా..? మీరు చేసిన అభివృద్ధి నీ ముందు పెట్టి ఓట్లు అడగాలి. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేస్తా…దత్తత తీసుకుంటా అని చెప్పడం సిగ్గు చేటు.
ఇక కేసీఅర్ కొడుకు కెటిఆర్.. డ్రామరావు. బీజేపీ పై చార్జీ షీట్ విడుదల చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఇప్పుడైనా మాట్లాడుతున్నారు.. మంచిదే. మీరు మీరు ద్యుయెట్లు పాడుకొనే సమయం పూర్తి అయ్యింది కాబట్టి డ్రామా లు ఆడుతున్నరు. కానీ మీరు రాష్ట్రంలో ఏం చేశారు డ్రామా రావు గారు. మీరు ఎన్ని మాటలు చెప్పారు..ఎన్ని తప్పారు. ఇంటికో ఉద్యోగము అని చెప్పి మోసం… పోడు పట్టాలు అని మోసం. నిరుద్యోగ భృతి అని చెప్పి మోసం..దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం. అందుకే KTR ను 420 అనాలి..మోసం చేసిన వాళ్ళను ఇలానే అంటారు. ఎన్ని వాగ్ధానాలు ఇచ్చారు..ఎన్ని తప్పారు. మునుగోడులో ఒక ఎమ్మెల్యే అంటున్నాడు… తెరాస కి ఓటు వేయక పోతే పెన్షన్ లు బంద్ చేస్తారట. అధికార మదం కాకపోతే ఏం మాటలు. మీ అబ్బా సొమ్ము ఇస్తున్నార..? ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు..? ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి మీ అనుమతి కావాలా..? కాళేశ్వరంలో దోచుకున్న సొమ్ముతో ఇస్తున్నారా. కెటిఆర్ ఫీనిక్స్ సొమ్మును ఇస్తున్నారా..? కవిత లిక్కర్ స్కాం సొమ్ము ఇస్తున్నారా..
బంగారం లాంటి తెలంగాణ ను అప్పుల తెలంగాణగా మార్చారు. రైతులను ఆగం చేశారు. వ్యవసాయంపై అన్ని పథకాలు బంద్ పెట్టి ముష్టి 5 వేలు ఇస్తున్నాడు. అమలు చేస్తామని చెప్పిన ప్రతి హామీ మోసమే. బంగారు తెలంగాణ కేసీఅర్ కుటుంభానికి అయ్యింది. బంగారు తెలంగాణలో నిరుద్యోగుల చావులే అధికం. లేటర్లు రాసి మరి చనిపోతున్నారు. అయినా కేసీఅర్ లో చలనం లేదు. ధరణి పేరు చెప్పి మొత్తం మోసమే. భూములు కాజేసే కుట్ర చేశారు. లక్ష కోట్లతో అద్భుతమైన అబద్ధంతో కూడిన ప్రాజెక్ట్ కట్టారు. 50 వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని ప్రాజెక్ట్ లక్షా 20 వేల కోట్ల తో కట్టాడు. 70 వేల కోట్లు దోచుకున్నాడు.
Also Read : మునుగోడు ఎన్నికలు బహిష్కరించండి వైఎస్ షర్మిల పిలుపు