Sunday, November 24, 2024
HomeTrending NewsTammineni vs Sharmila: షర్మిల.. తమ్మినేనిల ఆసక్తికర సంవాదం

Tammineni vs Sharmila: షర్మిల.. తమ్మినేనిల ఆసక్తికర సంవాదం

యువతను నిరుద్యోగం పట్టిపీడిస్తున్నా కేసీఆర్ గారికి సోయి లేదు. ప్రశ్నిస్తే, అధికారం అడ్డంపెట్టుకొని గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.  టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేసి.. విద్యార్థుల కోసం పోరాడుదాం అని వైఎస్ షర్మిల విపక్ష పార్టీలకు పిలుపు ఇచ్చారు. ప్రతిపక్షాలు ఏకమై పోరాడితే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె విపక్ష పార్టీ నేతలను కలిశారు. తొలుత తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ను కలిశారు. ఆయనే టీ-సేవ్ చైర్మన్ పదవీ చేపట్టాలని నిన్న ప్రతిపాదించారు.

తర్వాత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వాస్తవానికి షర్మిల వచ్చి.. వీరభద్రాన్ని కలిసింది టీ-సేవ్ గురించి. అయితే ఆయన మాత్రం బీజేపీకి బీ టీమ్‌ మాదిరిగా వైఎస్ ఆర్ టి పి పనిచేస్తుందని షర్మిలతో అన్నారట. అలా అనగానే అదేం లేదు.. బీజేపీ చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతున్నామని పేర్కొన్నారు. ఆ పార్టీని మతతత్వ పార్టీ అని బహిరంగంగా కామెంట్ చేసేది తామేనని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కాగా బీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు బీ టీమ్‌గా పనిచేశాయని షర్మిల అన్నారు. తమ పార్టీ ఏ రోజు.. మరో పార్టీ కోసం పనిచేయలేదని స్పష్టంచేశారు. టీ-సేవ్‌లో బీజేపీ ఉంటే.. తాము కలిసి రాబోమని తమ్మినేని వీరభద్రం తేల్చిచెప్పారు. ఈ అంశాన్ని తాము గౌరవిస్తున్నామని షర్మిల తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ కలిసి పనిచేయాలని కోరారు. తమ్మినేని, షర్మిల మధ్య మాట-ప్రతి మాటకు కంగుతిన్న ఇరు పార్టీల శ్రేణులు. ఆ తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో భేటీ అయ్యారు. టీ-సేవ్‌కు మద్దతు తెలుపాలని కోరారు.

Also Read : YSRTP: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్