తెలంగాణలో 9 ఏళ్లుగా కేసీఅర్ చేస్తుంది పచ్చి మోసమని, డబుల్ బెడ్ రూం అని రాష్ట్రంలో పేదలను మోసం చేశారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర 225వ రోజు నర్సంపేట్ నియోజకవర్గం చింత నెక్కొండ, సాయిరెడ్డిపల్లి, ఏబీ తాండా మీదుగా ఈ రోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నెక్కొండ మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… కేజీ టూ పీజీ ఉచిత విద్య మోసమని, అసలు రాష్ర్టంలో సర్కార్ బడులు బంద్ పెట్టే స్థాయిలో ఉన్నాయని ఆరోపించారు.
మూడు ఎకరాల భూమి అని మోసం..పోడు పట్టాలు అని మోసం..రుణమాఫీ అని మోసం..కెసిఆర్ ప్రజలను మోసం చేయటమే పనిగా పట్టుకున్నాడని వైఎస్ షర్మిల విమర్శించారు. తెలంగాణలో అప్పు లేని రైతు లేడని, 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఈ 8 ఏళ్లలో ఉద్యోగాలు లేక 100 ల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. బంగారు తెలంగాణ కేసీఅర్ కుటుంభానికి అయిందని, ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఅర్..ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల కోసం కెసిఆర్ బయటకు రాడన్నారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే బయటకు వస్తాడని, ఓట్లు అయితే మళ్ళీ తిరిగి కూడా చూడడన్నారు. ఈసారి ఎన్నికలు ఉన్నాయని, కేసీఅర్ మళ్ళీ వస్తాడన్నారు.
కేసీఅర్ సర్కార్ కూలి పోవాలని, కేసీఅర్ ఫామ్ హౌజ్ కి పరిమితం కావాలని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల కష్టాలు చూస్తూ 3500KM పాదయాత్ర చేశానన్న వైఎస్ షర్మిల మళ్ళీ వైఎస్సార్ పాలన ప్రతి గడపకు చేరుస్తమని భరోసా ఇచ్చారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు మహిళ పేరు మీద కట్టిస్తానన్నారు. వైఎస్సార్ ప్రతి పథకానికి జీవం పోస్తానని స్పష్టం చేశారు.
Also Read : తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం – వైఎస్ షర్మిల