ఎమ్మెల్యేలు నియోజక వర్గంలో సమస్యలు పక్కన పెట్టి… అందరూ మునుగోడు మీద పడ్డారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారట అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో బాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మునుగోడు ఉప ఎన్నికపై ఘాటుగా స్పందించారు. మందు తాగిస్తున్నారు… ఓట్లను కొంటున్నారాణి, మునుగోడు వీదుల్లో కుక్కల కొట్లాట జరుగుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు పాలన మొత్తం గాలికి వదిలేశారన్నారు.
వైఎస్ షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే…
ఎమ్మెల్యేలు,మంత్రులు మొత్తం మునుగోడు చేరారు. 118 నియోజక వర్గాల్లో పాలన గాలికి వదిలేసి… ఒక నియోజక వర్గం మీద పడ్డారు. ఇక కేసీఅర్ ఢిల్లీలో మకాం వేశారు. బిడ్డను అరెస్ట్ చేయకుండా లాబియింగ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు. TRS ను BRS చేశారు… కోడి కొటర్ లు పంచుతున్నారు. ఇక్కడ దోచుకున్నది చాలదని…ఇక దేశం మీద పడ్డాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బ్రతుకే లేని తెలంగాణ చేశారు కదా..! మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఅర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు.
జాతీయ పార్టీలు పెట్టీ విమానాలు కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి .? వేల కోట్ల విలువ జేస్తే ఆస్తులకు కేసీఅర్ కూడా బెట్టుకున్నారు. కేసీఅర్ అరాచకాలను ప్రశ్నించే పరిస్థితి తెలంగాణ లో లేదు. బండి సంజయ్,రేవంత్ రెడ్డి ఇద్దరు మెగా కృష్ణా రెడ్డి కి అమ్ముడు పోయారు. కాళేశ్వరంపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం నేను చేస్తున్న. బీజేపీ దగ్గర ఆధారాలు ఉన్నాయి…ATM అంటున్నారు…కానీ చర్యలు లేవు. తెలంగాణ లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకే పార్టీ పెట్టాం.
స్థానిక ఎమ్మెల్యే హనుమత్ షిండే అంట. నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తుంటే షిండే ను ఉతికి పారెయ్యమని జనాలు చెప్తున్నారు. అసలు ఎందుకు ఈయన మీద వ్యతిరేకత ఉంది అని అడిగా. అసలు ఈ ఎమ్మెల్యే నియోజక వర్గంలో ఉండడట. ప్రతి మండలాన్ని అనుచరులకు పంచేశాడట. అనుచరులతో దందాలు చేపిస్తడట…వాటాలు తేసుకుంటాడట. ఈ షిండే ఇసుక బకాసురుడు అంట కదా. మొత్తం ఇసుకను దున్నేశాడట కదా. ఇసుక మాఫియా మీద మాట్లాడితే 18 మంది మీద కేసులు పెట్టాడట.
తెరాసలో అందరూ ఇలానే తయారయ్యారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నాడు…24 గంటలు పవర్ ఇస్తున్నడట. 24 గంటలు కరెంట్ ఇస్తే మోటర్లు ఎందుకు కాలిపోతాయి..? విద్యుత్ శాఖ మంత్రి ఇలాకా సూర్యాపేట లో మోటర్లు కాలిపోయిన సంగతి మీకు తెలియదా..? ఇద్దరు రైతులు కరెంట్ షాక్ తో చనిపోతే పట్టించుకున్నవా…? నియోజక వర్గంలో సమస్యలు పక్కన పెట్టీ… అందరూ మునుగోడు మీద పడ్డారు.
Also Read : YSRTPని గెలిపిస్తే రెండు కోట్ల ఉద్యోగాలు -షర్మిల