YSRతెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Y.S. షర్మిల గురువారం మేడారంలో సమ్మక్క సారాలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క,సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని షర్మిల సందర్శించారు.