Saturday, April 20, 2024
HomeTrending Newsఅసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు

అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు

Firing Asaduddin Awaisi Convoy :

అల్ ఇండియా ముస్లిం ఇత్తెహాదుల్ ముస్ల్మీన్ (ఏ ఐ ఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని అసద్ అనుచరులు వెంటాడి పట్టుకున్నారు.  అతనిని నోయిడాకు చెందిన సచిన్‌గా గుర్తించారు. అలాగే నిందితుడి వద్ద నుంచి 9ఎంఎం పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తుండగా అసదుద్దీన్ కాన్వాయ్‌పై కాల్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద దుండగులు ఓవైసీ కాన్వాయ్ మీద కాల్పులు జరిపారు. ఓవైసీ క్షేమంగా బయటపడ్డారు.కాల్పుల ఘటనను ఓవైసీ ధ్రువీకరించారు. తన కారు డ్యామేజ్ అయిందని, తాను మరో కారులో వెళ్లిపోయానని చెప్పారు.

తాను ప్ర‌యాణిస్తున్న కారుపై కాల్పులు జ‌రిగిన ఘ‌ట‌న గురించి మీడియాతో మాట్లాడిన అస‌దుద్దీన్ ఓవైసీ.. తన వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మూడు నుంచి నాలుగు రౌండ్ల  కాల్పులు జ‌రిపార‌ని తెలిపారు. కాల్పుల కార‌ణంగా కారు టైర్లు పంక్చర్ అయ్యాయని మ‌రో వాహనంలో ఢిల్లీకి ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, అస‌దుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేదు. పోలీసుల నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్