Thursday, January 23, 2025
HomeTrending NewsYSRCP: అవిశ్వాసానికి విలువలేదు: పెద్దిరెడ్డి

YSRCP: అవిశ్వాసానికి విలువలేదు: పెద్దిరెడ్డి

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. లోక సభలో జరిగిన చర్చలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడారు.  వేదం కాలం నుంచి మహిళలను గౌరవించడం మన సంప్రదాయంగా వస్తోందని… కానీ మణిపూర్ లో జరిగిన ఘటనలు బాధాకరమన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి రావాలని సూచించారు.

ఆ రాష్ట్రంలోని ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి ఓ పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు, పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకు రావడానికి  కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నా, అది భారత దేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని,  అక్కడి పరిణామాలపై వెంటనే చర్యలకు ఉపక్రమించాలని కోరారు. మణిపూర్ ఘటనలు మన దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అవిశ్వాస తీర్మానానికి విలువ లేదని, సభలో ఎన్డీయే కు సంపూర్ణ మద్దతు ఉందని,  రెండు కూటముల మధ్య రాజకీయ ఆధిపత్యం కోసమే ఈ అవిశ్వాసం పెట్టినల్టు ఉందని అందుకే తమ పార్టీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తోందని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్