Saturday, November 23, 2024
HomeTrending Newsజూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణ’

జూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణ’

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణా’ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ ఛైర్మన్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు. ఆవిర్భావానికి కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు.

వైఎస్సార్ సంక్షేమ పాలన తెలంగాణాలో మళ్ళీ తీసుకురావడం కోసం, అయన ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, దివంగత నేత అందించిన సంక్షేమం ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా చూడడం కోసమే “YSR తెలంగాణ” పార్టీ పెడుతున్నట్లు రాజగోపాల్ వెల్లడించారు.

ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయని, పార్టీ పేరు విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని శ్రీమతి వైఎస్ విజయమ్మ ఇచ్చిన లేఖ కూడా సమర్పించామని చెప్పారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్వయంగా విజయమ్మ గారి అనుమతితో, ఆశీస్సులతో జరిగింది కాబట్టి ఇతరులకు కూడా అభ్యంతరం ఉంటుందని అనుకోవడం లేదని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.

“వైఎస్సార్ తెలంగాణ” పార్టీకి సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చిందని, ఇంతవరకూ ఎలాంటి అభ్యంతరాలు రాలేదు కాబట్టి అనుమతి ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని భావిస్తున్నామని రాజగోపాల్ చెప్పారు.

ఈ మేరకు లోటస్ పాండ్, శ్రీమతి వైఎస్ షర్మిల కార్యాలయం పేరిట పత్రికా ప్రకటన విడుదల చేశారు.
.

RELATED ARTICLES

Most Popular

న్యూస్