Saturday, January 18, 2025
HomeTrending Newsబాలకృష్ణ, లోకేష్ లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

బాలకృష్ణ, లోకేష్ లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ముఖ్యమంత్రి జగన్ పై, వైయస్సార్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్ ద్వారా జగన్ కు వ్యతిరేకంగా పాట ప్రసారం చేస్తున్న నారా లోకేష్ లపై  రాష్ట్ర ఎన్నికల ప్రదానాదికారికి వైయస్సార్ సిపి ఫిర్యాదు చేసింది. శాసనసభ్యుడు మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఫిర్యాదుతోపాటు ఆధారాలను అందచేశారు.

1.తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ ఈనెల16వ తేదీన కర్నూలులో స్వర్ణాంధ్ర సాకారయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, తిట్లు, శాపనార్ధాలు, బూతులతో ప్రసంగించారని, ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యాఖ్యలు చేసినందుకు బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు.

2. టిడిపి జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా జగన్ ను  ఉధ్దేశించి సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ ఒక వీడియో పాటను పోస్ట్ చేశారని, ఈ పాటను కర్నూలు జిల్లాలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభలో ప్లే చేశారని, పైగా అది యూట్యూబ్ ఛానల్ లో టెలికాస్ట్ అవుతోందని… దీనిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

3. ఆంధ్రజ్యోతి దినపత్రికలో జగన్ సేవలో జవహర్ అనే శీర్షికన ఈనెల 17వ తేదీన న్యూస్ ఐటమ్ ప్రచురించారని, జగన్ కు మధ్దతు ఇస్తున్నారనే విధంగా పత్రికలో అవాస్తవాలతో కూడిన కధనం ఇవ్వడం ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్