Tuesday, March 10, 2026
HomeTrending Newsఎమ్మెల్సీ హఠాన్మరణం : సిఎం దిగ్భ్రాంతి

ఎమ్మెల్సీ హఠాన్మరణం : సిఎం దిగ్భ్రాంతి

Ysrcp Mlc Kareemunnisa Died After Heart Attack :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మరణించారు. నిన్న శాసనమండలి సమావేశాలకు కూడా హాజరైన ఆమె రాత్రి 11.30 గంటల ప్రాంతంలో  చాతీ నొప్పితో స్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.  కరీమున్నీసా హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశారు. ఆమె సేవలను గుర్తించిన జగన్ ఆమెను మండలి అభ్యర్ధిగా ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి 26న ఎమ్మెల్యే కోటాలో ఆమె శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.

Also Read : చెంప చెళ్లు పాఠం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular