Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్రెండో మ్యాచ్ లోనూ విజయం: ఇండియాదే సిరీస్

రెండో మ్యాచ్ లోనూ విజయం: ఇండియాదే సిరీస్

India won Series:
న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి-20 సిరీస్ ను ఇండియా గెల్చుకుంది. రాంచీ లోని  జే ఎస్ సి ఏ స్టేడియంలో జరిగిన రెండో టి 20లో ఇండియా 7 వికెట్లతో ఘన విజయం సాధించి ­2-0  తేడాతో సిరీస్ లో ఆధిక్యం చాటింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మరోసారి గట్టి పునాది వేశారు. మొదటి వికెట్ కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహూల్ 65 (49 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు);  కెప్టెన్ రోహిత్-55 (36 బంతులు, 1 ఫోర్, 5 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యారు. గత మ్యాచ్ లో రాణించిన సూర్య కుమార్ యాదవ్ ఈసారి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేష్ అయ్యర్, పంత్ లు మరో వికెట్ పడకుండా 17.2 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించారు.  ఇండియా కోల్పోయిన మూడు వికెట్లూ కివీస్ కెప్టెన్ సౌతీకే దక్కాయి.

అంతకుముందు, టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ లో ఓపెనర్లు గుప్తిల్, డేరిల్ మిచెల్ చెరో 31 పరుగులు చేశారు. క్యాంప్మాన్-21; గ్లెన్ ఫిలిప్స్­-34 పరుగులతో రాణించారు. నిర్ణీత 20  ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153  పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో హర్షల్ పటేల్ కు రెండు, భువి, దీపక్ చాహర్, అక్షర పటేల్, అశ్విన్ లకు తలా ఒక వికెట్ దక్కింది.

రెండు కీలక వికెట్లు పడగొట్టిన హర్షల్ పటేల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది

Also Read : మొదటి టి 20లో ఇండియా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్