వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లినుంచి బయల్దేరిన ఆయన నేరుగా ఇడుపులపాయకు చేరుకొని అక్క్కడ వైయస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి, అనంతరం సర్వ మత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. జగన్ తల్లి వైఎస్.విజయమ్మ కూడా జగన్ వెంట ఉన్నారు.
ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి జగన్ రోడ్ షో ప్రారంభమైంది. వేంపల్లి, వీరపునాయుని పల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుంటుంది. అక్కడ జరిగే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. అటునుంచి సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, చాగలమర్రి క్రాస్ రోడ్స్ మీదుగా ఆళ్లగడ్డ చేరుకుంటుంది. అక్కడ రాత్రి బస చేస్తారు.