Friday, June 12, 2026
HomeTrending Newsమార్చిలో 'జగనన్నే మా భవిష్యత్తు'

మార్చిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’

ఇప్పటికే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో  ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చి 18 నుంచి 26 వరకూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రతి గడపకూ ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 5.65 లక్షల మంది వైయస్సార్సీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు గడప, గడపకూ… మొత్తం 1.65 కోట్ల ఇళ్ళను సందర్శించి పథకాలపై ప్రచారం చేయాలని కోరారు.  ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,  ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జగన్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు… వాటిలో ముఖ్యాంశాలు:

  • దాదాపు 5 లక్షల మంది గృహసారథులను.. 93 శాతం నియామకం పూర్తయ్యింది
  • ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి
  • పార్టీకార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవారు
  • గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి
  • రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి.
  • మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి
  • ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రలు నిర్వహించాలి
  • సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది
  • వీరంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొంటారు.

  • గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు
  • గృహసారథులను కో–ఆర్డినేట్‌ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలి
  • గడపగడపకూ మన ప్రభుత్వం నిర్వహణ అత్యంత కీలకం
  • ఇప్పటివరకూ దాదాపు 7447 సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాం.
  • నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి
  • ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలి
  • సుమారు 14 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి
  • టీడీపీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తున్నాం
  • ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి. వీటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి:
  • గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి
  • జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular