Sunday, September 22, 2024
HomeTrending Newsఐ ప్యాక్ మాజీలతో రాజకీయ వ్యూహాలు

ఐ ప్యాక్ మాజీలతో రాజకీయ వ్యూహాలు

Ys Sharmila : తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల చర్యలు చేపట్టారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగం ప్రజలతో మమేకం అయ్యే విధంగా ప్రణాలికలు సిద్దం చేశారు. ఇందుకోసం ప్రజల్లో పట్టు ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించటం, ప్రజా పోరాటాల్లో ముందు ఉండి నడిపే నాయకుల అన్వేషణ సాగుతోంది. తాజాగా రాజాకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించటం, ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్ కిషోర్ కు పోటీగా పీకే శిస్యులనే షర్మిల రంగంలోకి దింపారు.

పీకే  శిష్యులతో గ్రౌండ్ వర్క్ చేయిస్తున్న షర్మిల ఐ ప్యాక్ మాజీ ఉద్యోగులే ప్రస్తుతం వ్యూహకర్తలుగా ఆమె పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పికే టీం నుంచి బయటకు వచ్చి ఇప్పటికె షర్మిల టీం లో చేరిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం గ్రౌండ్ లెవల్ లో ప్రజాభిప్రాయం సేకరణ చేస్తున్నారు. మాజీ ఐ ప్యాక్ ఉద్యోగి రిషి రెడ్డి నేతృత్వంలో ఈ టీం పనిచేస్తోందని సమాచారం.

రిషి రెడ్డి సీపీఐ మాజీ ఎంపి రావి నారాయణ రెడ్డి కి ముని మనవడు కాగా ఐ ప్యాక్ లో పొలిటికల్ స్టాటేజి యూనిట్ హెడ్ గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. పశ్చిమ బెంగాల్,తమిళనాడు,మహారాష్ట్ర,ఏపి శాసనసభ ఎన్నికల్లో యూనిట్ హెడ్ గా పని చేసిన రిషి రెడ్డి వై.ఎస్.ఆర్.టి.పి కి  15వేల ఓట్లు సాధించగల అభ్యర్థులను ఐడెంటి ఫై  చేసే సర్వేలో తలమునకలయ్య్యారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నియోజక వర్గాల పై ఫోకస్ చేయటం, ఇతర పార్టీ లో ఉన్న అసంతృప్తి నేతలను పార్టీ లో చేర్పించేలా వ్యూహకర్తలు ఫోకస్ చేస్తున్నారు.

పాదయాత్ర కోసం మరో ఇద్దరు ఐ ప్యాక్ మాజీ ఉద్యోగస్తులను షర్మిల తీసుకున్నారు. ప్రీతమ్,అనిరుద్ ఇద్దరు మాజీ ఐ ప్యాక్ మాజీ ఉద్యోగస్తులు కాగా అనిరుద్ గతంలో ఏపి ప్రభుత్వానికి అడ్వైజరీ గా పని చేసిన అనుభవం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్